MOVIE NEWS

పుష్ప 2 : సెన్సార్ కత్తెరించిన సన్నివేశాలు ఏమిటో తెలుసా ..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.రిలీస్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ఈ సినిమాకు భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు.త్వరోలోనే ఈ సినిమాకు సంబంధించి భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.పుష్ప వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత అల్లుఅర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ పెండింగ్ లో ఉండటంతో ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆందోళన పడ్డారు.తాజాగా వారి ఆందోళనకు తెర పడింది.దర్శకుడు సుకుమార్ ఎంతో కస్టపడి ‘పుష్ప 2′ సినిమా ఫైనల్ కాపీ సిద్ధం చేయగా తాజాగా సెన్సార్ కూడా పూర్తి అయింది.’పుష్ప 2’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యుఎ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే ఆ సర్టిఫికెట్ ఇవ్వడానికి ముందు సినిమాలో కొన్ని మార్పులు సూచించింది. రెండు సన్నివేశాలలో ఇబ్బందిగా అనిపించే వాటికి సెన్సార్ కత్తెర వేసింది. ఈ సినిమాలో దర్శకుడు సుకుమార్ యాక్షన్ సీన్స్ భారీగా తెరకెక్కించారు..

సూర్య సినిమాకి మళ్ళీ అలాంటి టైటిల్..వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!!

ఓ సన్నివేశంలో పుష్పరాజ్ నరికిన కాళ్లు గాల్లో ఎగురుతూ వుంటాయట. దానిని తొలగించమని సెన్సార్ సూచన చేయగా మేకర్స్ సీజీతో కవర్ చేసేశారు. అలాగే మరొక సన్నివేశంలో విలన్ చెయ్యి నరికి దాన్ని పట్టుకుని హీరో నడుచుకుంటూ వెళతాడట. అది కూడా తీసేయమని సెన్సార్ తెలిపింది. దాంతో కట్ అయిన పార్ట్ చూపించకుండా సన్నివేశాన్ని కాస్త జూమ్ చేశారు. ఈ రెండు కత్తెరలు క్లైమాక్స్ యాక్షన్స్ సీక్వెన్స్ లో ఉన్నట్లు సమాచారం.యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని పదాలకు సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘

పుష్ప 2’ ప్రారంభంలో ‘రండి’ అని ఒక పదం వుంటుందట అయితే తెలుగులో రండి అంటే గౌరవం. కానీ హిందీలో మహిళను వేశ్య అని కించపరచడం దీనితో ఆ పదం పట్ల సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేయగా ‘లపాకీ’ అని మేకర్స్ మార్చారు.ఇంకొక సన్నివేశంలో ‘వెంకటేశ్వర’ అని వచ్చే డైలాగులో ‘భగవంతుడా’ అని మేకర్స్ మార్చారు. ఇలా ఈ ఐదు కత్తెరలు తప్ప సినిమాలో ఇంక వేటికి కూడా సెన్సార్ అడ్డు చెప్పలేదు.

Related posts

మెగా సీజన్ స్టార్ట్స్

filmybowl

వీరమల్లు కాదనుకుంటే విశ్వంభర రెడీ

filmybowl

మరో క్రేజీ సాంగ్ తో వస్తున్న పుష్ప రాజ్.. ప్రోమో అదిరిందిగా.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..?

murali

Leave a Comment