MOVIE NEWS

పుష్ప 2 : 1000 కోట్ల సినిమాపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజేంద్రప్రసాద్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప2 ‘… డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా 6 రోజుల్లోనే 1000 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఇండియన్ సినీ హిస్టరీ లోనే 1000 కోట్ల మార్క్ ఇంత ఫాస్ట్ గా దాటిన సినిమా మరొకటి లేదు.. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఇమేజ్ అమాంతం పెరిగింది.. పాన్ ఇండియా వైడ్ అల్లుఅర్జున్ బాగా పాపులర్ అయ్యారు.. పుష్ప 2 లో అల్లుఅర్జున్ పెర్ఫార్మన్స్ కి మరోసారి నేషనల్ అవార్డు ఖాయమని చాలా మంది ఫ్యాన్స్ భావిస్తున్నారు..

అయితే గతంలో పుష్ప సినిమాకుగాను అల్లుఅర్జున్ కి ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు ఇవ్వడంతో చాలా మంది ఆయనని విమర్శించారు.. గొప్ప సినిమాలన్నిటిని పక్కన పెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పాత్రకి అవార్డు ఇచ్చారు అని కొంతమంది బహిరంగంగానే విమర్శించారు.. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాపై సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘హరి కథ’ అనే వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ..’ కలియుగంలో వస్తున్న కథలు చూస్తున్నారు కదా..నిన్న కాక మొన్న చూశాం.. వాడెవడో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే దొంగ.. వాడు హీరో.. హీరోల్లో అర్థాలు మారిపోయాయి..’ అని ఆయన అన్నారు.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

అయితే ఈ వ్యాఖ్యలు ‘పుష్ప 2′ లో అల్లు అర్జున్ ను ఉద్దేశించే రాజేంద్ర ప్రసాద్ అన్నాడని సోషల్ మీడియాలో ఆ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి… ఆ తర్వాత మెల్ల మెల్లగా అది కాస్త వివాదంగా మారింది. దీంతో రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తాను అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.అల్లు అర్జున్ నా కొడుకు లాంటి వాడు. అతడిని అలా అంటానా. బన్నీ నువ్వు నా బంగారం లవ్ యూ. నేను పుష్ప సినిమాపై నెగిటివ్ గా మాట్లాడానని వచ్చిన వార్తలు చూసి నవ్వుకున్నాను. ఇన్ని సంవత్సరాలుగా ఒక్క వివాదం లేదు కదా కొత్తగా ఇది వచ్చింది అంటూ ఎంజాయ్ చేశాను. కానీ ఇది చేసింది ఎవరో కానీ వాడికి ఒక్కటే చెబుతున్నాను. అది అల్లు అర్జున్ ని ఉద్దేశించి అనలేదు..’ అంటూ రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు..

Related posts

పబ్లిక్ ప్లేస్ లో వున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో.. బన్నీపై సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్..!!

murali

ఫారెన్ వీధుల్లో సామాన్యుడిలా ఎన్టీఆర్.. వీడియో వైరల్..!!

murali

పుష్ప 2 :ఆ కీలక సన్నివేశాలు ఎడిట్ చేసిన సుకుమార్.. దాని కోసమేనా..?

murali

Leave a Comment