MOVIE NEWS

పుష్ప 2 : సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా వస్తుందటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాలో మరోసారి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరెకెక్కీస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

“పుష్ప 2” మొదటి షో పడింది.. ఇంతకీ టాక్ ఎలా ఉందంటే..?

ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్ మరియు జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు..తాజాగా ఈ సినిమా షూటింగ్ ముగించిన దర్శకుడు సుకుమార్. మొదటి కాపీని రెడీ చేసి సెన్సార్ కోసం పంపించడం జరిగింది..నేడు ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ను జారీ చేసారు. సినిమాలో అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేస్తూ మరి కొన్ని కట్స్ చేయాలిని మేకర్స్ కు సెన్సర్ టీమ్ సూచించారు. ఈ సినిమాలో కాస్త ఎక్కువగా వైలెన్స్, హింస కలిగి ఉండడంతో ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ ను సర్టిఫికెట్ జారీచేశారు.

దింతో 18 సంవత్సరాలు దాటని పిల్లలకు పుష్ప -2 ను థియేటర్స్ లో చూసేందుకు అనుమతి లేదు. మొత్తం 3గంటల 20 నిమిషాల రన్ టైమ్ తో పుష్ప2 రిలీజ్ అవుతుంది.. ఈ సినిమాలోని జాతర ఎపిసోడ్ దాదాపు 25 నిముషాలు ఉంటుందని సమాచారం.. ఈ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. సినిమా చూసిన తరువాత సెన్సార్ సభ్యులు పుష్ప టీమ్ కు విషెష్ తెలిపారు.విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు..ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. త్వరలోనే ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారు..

Related posts

బాలయ్య షోకి మరోసారి వస్తున్న డాన్సింగ్ క్వీన్.. పిక్స్ వైరల్..!!

murali

Nandamuri Bala Krishna : బాక్సులు బద్దలయ్యే అప్డేట్.. ఇక దబిడి దిబిడే!

filmybowl

అఖండ 2 తాండవం…. అదరహో….

filmybowl

Leave a Comment