ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది.. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఏకంగా 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టించింది.పుష్ప 2 సినిమా బాహుబలి 2 రికార్డు ని సైతం బద్దలు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది.. తాజాగా ఈ సినిమా మేకర్స్ మరో 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేసి రీలోడెడ్ వర్షన్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు… ఇప్పటికే ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
ఈ ఒక్క సినిమాతో నా పాపాన్ని కడిగేసుకుంటా.. ఆర్జివీ సంచలన ట్వీట్ వైరల్..!!
ఇదిలా ఉంటే ఓటీటీ రిలీజ్ విషయంలో రూమర్స్ భారీగానే వస్తున్నాయి. పుష్ప2 విడుదల అయిన 56 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. దీంతో పుష్ప2 ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట న్యూస్ వైరల్ అవుతుంది..
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ ‘పుష్ప 2’ డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు సొంతం చేసుకుంది. సుమారు రూ. 200 కోట్లకు ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది.అయితే, నాలుగు వారాలకే డీల్ మాట్లాడుకున్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ అయింది. కానీ, ఇప్పుడు ఏడు వారాల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రానుంది. అంటే జనవరి 29న లేదా 31న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవనుంది అని తెలుస్తోంది