MOVIE NEWS

పుష్ప 2 : “కిస్సిక్ ‘సాంగ్ పై బిగ్ అప్డేట్..మేకర్స్ స్ట్రాటజీ మాములుగా లేదుగా..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2”..ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గత మూడేళ్లుగా అల్లు అర్జున్ నుంచి మరో సినిమా రాలేదు.. గతంలో అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప “ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది..అంతే కాదు ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కోసం వారెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీగా క్రేజ్ ఏర్పడింది.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను పార్ట్ 1 కంటే మరింత భారీగా తెరకెక్కించారు.. పార్ట్ 2 లో గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయని సమాచారం.. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం మేకర్స్ బీహార్ రాజధాని అయిన పాట్నాలో భారీ ఈవెంట్ ని నిర్వహించారు. ఆ ఈవెంట్ అద్భుత విజయం సాధించింది..

తండేల్ : ‘బుజ్జి తల్లి’ గుండెల్ని పిండేసిందిగా …

నార్త్ లో అల్లుఅర్జున్ రేంజ్ ఏంటో నిరూపించింది.. ఇదిలా ఉంటే ఈ నెల 24 న మేకర్స్ సౌత్ లో ఓ భారీ ఈవెంట్ చేస్తున్నారు.. సౌత్ స్టేట్ అయిన చెన్నై లో ఈ ఈవెంట్ జరగనుంది.. ఈ ఈవెంట్ లో సినిమాలోని స్పెషల్ సాంగ్ అయిన ‘కిస్సిక్’ ను ఆ రోజు సాయంత్రం 7.02 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు..అయితే ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి స్టార్ బ్యూటి శ్రీలీల అదిరిపోయే మాస్ స్టెప్స్ వేసింది..ఈ సాంగ్ కోసం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చినట్లు సమాచారం.. దీనితో ఈ సాంగ్ పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి..

Related posts

తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 కి భారీ ఊరట..టికెట్ రేట్స్ భారీగా పెంపు..!!

murali

ముగిసిన వార్ 2 షూటింగ్.. ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..?

murali

బాలయ్య సినిమాలో దుల్కర్ ని అందుకే తీసుకోలేదు.. బాబీ షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment