MOVIE NEWS

మరో క్రేజీ సీక్వెల్ తో వస్తున్న పూరీ జగన్నాథ్.. ఈ సారైనా వర్కౌట్ అవుతుందా..?

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న పూరీ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం తంటాలు పడుతున్నాడు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన ‘లైగర్’ మూవీ భారీ డిజాస్టర్ గా నిలవడంతో పూరీ కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది..స్టార్ హీరోలు ఆయనను పట్టించుకోవడమే మానేశారు.. గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న రామ్ రీసెంట్ గా పూరీకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు.. దీనితో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను పూరీ తెరకెక్కించాడు.. ఈ సినిమా కూడా పూరీ కెరీర్ ని కాపాడలేకపోయింది..

“పుష్ప 2” ఫైనల్ కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి అప్పులన్నీ తీర్చేసిన పూరి జగన్నాథ్ ని ‘లైగర్’ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు మళ్ళీ అప్పుల్లోకి నెట్టేశాయి.. డబుల్ ఇస్మార్ట్ సినిమాపై పూరీ భారీగానే ఆశలు పెట్టుకున్నాడు కానీ రోటీన్ గా ఉండటంతో అది కూడా వర్కౌట్ కాలేదు..ఇప్పుడు పూరీ ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.. పూరీకి ఛాన్స్ ఇవ్వడానికి ఎవరూ సాహసించట్లేదు.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న గోపిచంద్ పూరీ తో సినిమా చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది..గతంలో గోపీచంద్, పూరి జగన్నాథ్ కాంబోలో `గోలీమార్‌` సినిమా వచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది.. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ‘గోలీమార్‌’ సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించబోతున్నట్టు సమాచారం…

గతంలో పూరీ స్క్రిప్ట్ వర్క్ అద్భుతంగా ఉండేది.. ఆయన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అదిరిపోయేయి.. చాలా మంది దర్శకులు పూరీని చూసి ఇన్స్పైర్ అయ్యేవారు.. అలాంటి పూరీ ఇప్పుడు ఇంతలా డౌన్ ఫాల్ అవ్వడంతో ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.. కానీ కింద పడిన ప్రతీ సారి పైకి లేవడం పూరీ స్టైల్.. ఈ సారి తన మార్క్ సినిమాతో వస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు..

 

Related posts

గేమ్ ఛేంజర్ : అంజలీ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న శంకర్..!!

murali

“కింగ్డమ్” గా వస్తున్న రౌడీ స్టార్.. టీజర్ మాములుగా లేదుగా..!!

murali

పబ్లిక్ ప్లేస్ లో వున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో.. బన్నీపై సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment