Puri Jagannadh desperately wants a hero...
MOVIE NEWS

పూరి జగన్నాథ్‌ కి హీరో నే దొరకట్ లేదు….

Puri Jagannadh desperately wants a hero...
Puri Jagannadh desperately wants a hero…

Puri Jagannadh : డాషింగ్‌ డైరెక్టర్‌ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్‌ గత పదేళ్ల కాలంలో చాలా సినిమాలనే చేసాడు. కానీ హిట్‌ కొట్టిన సినిమాలు ఎన్ని అంటే మాత్రం చాలా తక్కువ. ఎన్ని ఫ్లాప్స్ వచ్చిన పూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఆయన సినిమాలను అభిమానించని వాళ్ళు ఉండరు

ఈ లిస్ట్ సామాన్య ప్రేక్షకుడు వున్నాడు అంటే ఏదో అనుకోవచ్చు గానీ ఎంత మంది సెలబ్రిటీస్ కి పూరి సినిమా అంటే పిచ్చి. అధి ఎన్నో సార్లు చెప్పారు.

ఇటీవల రామ్‌ తో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రాన్ని రూపొందించిన పూరి కి నిరాశ ఎదురైంది. ఐనా కూడా పట్టు వదలకుండా మరో సినిమాకు రెడీ అవుతున్నారు. కానీ అవకాశం ఇచ్చే హీరో నే పూరికి కనిపించట్లేదు.

పూరి జగన్నాథ్ ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్‌ బ్లాక్ బస్టర్స్ ని అందుకున్న దర్శకుడు. ఆయన సినిమాల తీసే విధానం చూసి రాజమౌళి, వినాయక్ వంటి వారు సైతం ఆశ్చర్యపోయే వారు.

హీరో ఎంతటోడైనా గాని సినిమా మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడు పూరి. ఆయన సినిమాల బడ్జెట్‌ కూడా మినిమల్ గా ఉండి నిర్మాత కి భారీగా లాభాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆయన ఎంత తక్కువ బడ్జెట్‌తో సినిమాలు చేసినా వసూళ్లు మినిమం కూడా రావడం లేదు.

Read Also :  రవితేజ : మరోసారి ‘ధమాకా’

పూరి జగన్నాథ్‌ గడచిన పదేళ్ల కాలంలో చేసిన సినిమాల్లో ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతావన్నీ తీవ్రంగా నిరాశ పరిచాయి. అందుకే పూరి జగన్నాథ్‌ సినిమా అంటే జనాలు పెద్ద ఆసక్తి చూపట్లేదు. కానీ ఆయన్ను అమితంగా అభిమానించే ప్రేక్షకులు, ఆయన సినిమాలను ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇప్పటికీ ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఆశలు, అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. వారి కోసం అంటూ మరో సినిమాను పూరి జగన్నాథ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

టాలీవుడ్‌లో యంగ్‌ అండ్‌ క్రేజీ హీరోతో పూరి జగన్నాథ్‌
సినిమా చెయ్యాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది కానీ ఆ హీరో సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తుంది.

ఒకప్పుడు యూత్‌ని మాయ చేసి హీరోయిజం కి సరికొత్త అర్ధం చెప్పిన పూరి కి ఈరోజు హీరో దొరకపోడం కాస్త బాధించే విషయమే. పూరికి మళ్లీ రెండు హిట్‌ సినిమాలు పడితే స్టార్‌ హీరోలే కాదు గతంలో మాదిరిగా ఇతర భాషల హీరోలు సైతం ఆయన కోసం వేచి చూస్తారు. సో పూరి ఈసారి హిట్‌ కొట్టాల్సిందే.

Follow us on Instagram

Related posts

7/G బృందావన కాలనీ 2 : క్లాసిక్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..!!

murali

పుష్ప 2 : క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా.. ఇదిగో ప్రూఫ్..!!

murali

OG : పవర్ స్టార్ సినిమాలో గ్లోబల్ స్టార్ ఇది కదా మాస్ కాంబినేషన్..?

murali

Leave a Comment