MOVIE NEWS

పుష్ప 3 రిలీజ్ పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కింది.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది..అల్లుఅర్జున్ కెరీర్ లోనే పుష్ప 2 సినిమా సంచలన విజయం సాధించింది… పుష్ప 2 సినిమా ఏకంగా 1850 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి రికార్డు సైతం క్రాస్ చెసింది.. అల్లుఅర్జున్ కెరీర్ లో ఈ రేంజ్ హిట్ ఎవ్వరూ ఊహించలేదు..

వార్ 2 : ఫ్యాన్స్ ప్రమోషన్ వీడియో అదిరిందిగా..!!

ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ తారాస్థాయికి చేరింది..ఇదిలా ఉంటే పుష్ప 2 కి సీక్వెల్ గా పుష్ప 3 కూడా రూపొందుతుంది..తాజాగా పుష్ప 3 గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్ప 3 కి మేకర్స్ అదిరిపోయే లీడ్ కూడా ఇచ్చారు. అయితే అల్లు అర్జున్, సుకుమార్ మాత్రం పుష్ప 3 ఇప్పట్లో ఉండదని దానికి కాస్త టైం తీసుకుంటాం అని గతంలో తెలిపారు..తాజాగా పుష్ప నిర్మాత రవిశంకర్ రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. త్వరలో పుష్ప 3 సినిమాని తెర కెక్కిస్తున్నాం..మూడు సంవత్సరాల వ్యవధిలోనే ఈ సినిమాని కూడా పూర్తి చేస్తాము అని ఆయన తెలిపారు. దీంతో ప్రస్తుతం నిర్మాత వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

బన్నీ ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు..కానీ నిర్మాత చెప్పినట్టు మూడేళ్ళలో సినిమా పూర్తి చేయాలంటే ఇప్పుడే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టి షూట్ కూడా ప్రారంభించాలి.. కానీ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. యంగ్ డైరెక్టర్ అట్లీతో, త్రివిక్రమ్ తో అలాగే సందీప్ రెడ్డి వంగతో బన్నీ సినిమాలు సెట్ చేసుకున్నాడు. ఈ మూడు సినిమాలు పూర్తి అయ్యేసరికి చాలా టైం పట్టొచ్చు.అలాగే సుకుమార్ కూడా రామ్ చరణ్ తో, విజయ్ దేవరకొండతో సినిమాలు అనౌన్స్ చేసాడు. ఆ రెండు సినిమాలు పూర్తి కావడానికి కూడా చాలా టైం పడుతుంది.. కానీ నిర్మాత పుష్ప 3 గురించి చెప్పడంతో బన్నీ, సుకుమార్ లైనప్ లో ఊహించని ట్విస్ట్ రాబోతుందని తెలుస్తుంది..

 

Related posts

ఆ సూపర్ ” హిట్ ” మూవీ కాదు.. రవితేజ లైనప్ లో వున్న సినిమా ఇదే..!!

murali

భారీ రికార్డ్ కి అడుగు దూరంలో పుష్ప 2..ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా..?

murali

హరిహర వీరమల్లు.. విశ్వరూపం ఇది

filmybowl

Leave a Comment