MOVIE NEWS

మరో ఇంట్రెస్టింగ్ మూవీ మొదలెట్టిన ప్రశాంత్ వర్మ..!!

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అ!, జాంబి రెడ్డి వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న ప్రశాంత్ వర్శ ‘హనుమాన్’ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. గత ఏడాది రిలీజ్ అయిన ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది.. కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి.. ఇదిలా ఉంటే తాజాగా తన లేటెస్ట్ మూవీ ‘మహాకాళి’ సినిమాను ప్రశాంత్ వర్మ ప్రారంభించారు.PVCU (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) నుంచి వస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఇవాళ అధికారికంగా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. “విశ్వంలో అత్యంత క్రూరమైన సూపర్ హీరో” అంటూ పోస్టర్‌ను విడుదల చేశారు.

నాటు నాటు సాంగ్ వారు చేస్తే చూడాలని వుంది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

అయితే ‘హను-మాన్’ సినిమాతో ప్రభంజనం సృష్టించిన ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా చాలా సినిమాలు ఉండబోతున్నాయని గతంలోనే వెల్లడించారు. ఇందులో భాగంగా ‘మహాకాళి’ సినిమాను మేకర్స్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. పూజా కొల్లూరు డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా కథ బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా రూపొందుతోంది. మతపరమైన గంభీరత, స్థానిక పౌరాణిక చరిత్రలకు అనుగుణంగా తెరకెక్కిస్తున్నారట.

అయితే, ఈ సినిమాలో లీడ్ రోల్‌లో ఎవరు నటిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రానప్పటికి, బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా విలన్‌గా నటిస్తాడనే టాక్ మాత్రం వినిపిస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురు చూడాలి..బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తో సినిమా మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ అది ముందుకు సాగకపోవడంతో తన తరువాత సినిమాలను ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు..

Related posts

ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్.. క్రేజీ పిక్ అదిరిందిగా..!!

murali

వార్ 2 : ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఊహించని ట్విస్ట్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ గ్యారెంటీ..!!

murali

దేవర ప్రీ-రిచ్లీజ్ ఈవెంట్: జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నలుగురు ఐకానిక్ దర్శకులు స్టేజీ పంచుకోబోతున్నారు.

filmybowl

Leave a Comment