టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..” అ!” సినిమాతో అదరగొట్టిన ప్రశాంత్ వర్మ ఆ తరువాత తెరకెక్కించిన కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు.. ప్రశాంత్ వర్మ గత ఏడాది తేజా సజ్జ హీరోగా తెరకెక్కించిన హను-మాన్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.. గత ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.. హను -మాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘జై హనుమాన్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఇదే కాకుండా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో ఒక సినిమా.. అలాగే ఇండియన్ ఫస్ట్ సూపర్ వుమెన్ ప్రాజెక్ట్ మహాకాళి అనే ప్రాజెక్ట్‌లను ప్రశాంత్ వర్మ చేయబోతున్నాడు.
యానిమల్ సీక్వెల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..!!
అయితే ఈ మూడు సినిమాలు కాకుండా తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి తాజాగా మరో సినిమా రాబోతున్నట్లు సమాచారం..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రానున్నట్లు సమాచారం… ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్ కోసం త్వరలోనే ప్రభాస్ లుక్ టెస్ట్‌లో పాల్గొననున్నారని సమాచారం. ఇక ఈ సినిమాను కన్నడ టాప్ బ్యానర్ అయినా హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు సమాచారం. బిగ్గెస్ట్ మైథలాజికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. అవన్నీ పూర్తి కావడానికి కనీసం రెండు ఏళ్ల సమయం అయినా పట్టే అవకాశం ఉంది.. అయితే ఆ సినిమాలన్ని పూర్తి అయ్యాకే ప్రశాంత్ వర్మ సినిమాకు ప్రభాస్ డేట్స్ ఇస్తాడు.. దీనితో ప్రశాంత్ వర్మ ప్రభాస్ కోసం మరో రెండేళ్లు ఎదురు చూడాల్సిందే..