MOVIE NEWS

‘ఫౌజీ’ దర్శకుడికి ప్రభాస్ మరో బిగ్ ఆఫర్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ ఫౌజీ “.. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. బిగ్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించునున్నాడు. ప్రభాస్ సరసన కొత్త భామ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని సైతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం..దర్శకుడు హనురాఘవపూడి గతంలో తెరకెక్కించిన “ సీతారామం “ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. యుద్ధం తో కూడిన ప్రేమ కథ గా రూపొందిన ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది..ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న “ ఫౌజీ “ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు..

హరిహర వీరమల్లు : క్లైమాక్స్ పీక్స్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!!

ప్రభాస్ ఇంతకుముందు చేయనటువంటి సరికొత్త పాత్ర లో నటిస్తున్నాడు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది..అయితే హను రాఘవపూడి వర్క్ కి ఫిదా అయిన ప్రభాస్.. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇచ్చాడటా.. మరో కథ ను కూడా సిద్ధం చేసుకోమని సూచించినట్లు సమాచారం..అయితే హను రాఘవపూడి తో ప్రభాస్ రెండో సినిమా ఫిక్స్ అయినా ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ కనిపించడం లేదు.. దీనికి కారణం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు ఉండటమే..

ప్రభాస్ లైనప్ లో “ ది రాజాసాబ్ “,”స్పిరిట్”,”సలార్ 2”,”కల్కి 2”వంటి భారీ సినిమాలు వున్నాయి.. ఇవన్నీ పూర్తి కావడానికి చాలా టైం పడుతుంది.. ప్రస్తుతం ప్రభాస్ డైరీ ఫుల్ గా వుంది..వరుసగా షూటింగ్ లో పాల్గొంటు బిజీ గా గడిపేస్తున్నాడు..రెండేళ్లకు కనీసం మూడు సినిమాల తో అయినా ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రభాస్ ఆలోచన..

 

Related posts

డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముహూర్తం ఫిక్స్..!!

murali

పుష్ప 2 : ఆ సీన్ చూసాక రాజమౌళిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం అదేనా..?

murali

గేమ్ ఛేంజర్ : అంజలీ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న శంకర్..!!

murali

Leave a Comment