MOVIE NEWS

షూటింగ్ టైం లో ప్రభాస్ నాలో సగం వున్నాడు.. విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ లో ప్రస్తుతం వున్న స్టార్ హీరోల్లో పర్ఫెక్ట్ కటౌట్ వున్న హీరో ఎవరంటే అంతా ప్రభాస్ పేరే చెబుతారు.. ప్రభాస్ హైట్ కి తగ్గ పర్సనాలిటీతో పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ గా ఉంటాడు.. అందుకే ఆయన ఏ పాత్ర చేసిన పెర్ఫెక్టుగా సరిపోతుంది..పాన్ ఇండియాని షేక్ చేసిన బాహుబలి ఆ రేంజ్ లో హిట్ అవ్వడానికి మెయిన్ కారణం ప్రభాస్.. ఒరిజినల్ రాజు కావడంతో ప్రభాస్ కు ఆ పాత్ర సరిగ్గా సరిపోయింది.. వేరే ఏ హీరోని కూడా ప్రభాస్ ప్లేస్ లో ఉహించుకోలేము..అలాంటి హీరోను తన బాడీ బిల్డింగ్‌తో డామినేట్ చేశానని మంచు విష్ణు అంటున్నాడు.. ‘కన్నప్ప’ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే..

పుష్ప 3 రిలీజ్ పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఆ పాత్ర కోసం మంచు విష్ణు బాగానే బాడీ పెంచాడు. ఆ సినిమా నుంచి ఈ మధ్య రిలీజ్ చేసిన రెండు పాటల్లోనూ కండలు తిరిగిన దేహంతో భారీగా కనిపించాడు. అయితే విష్ణు ఎంత బాడీ బిల్డింగ్ చేసినా సరే.. ప్రభాస్ ముందు అది దిగ దుడుపే అవుతుంది.. కానీ స్వయంగా ప్రభాస్.. విష్ణును చూసి నీలో నేను సగం ఉన్నా అని కామెంట్ చేశాడంటే అంతా ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు..ఈ విషయాన్ని స్వయంగా విష్ణు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు..

ఇప్పుడున్న టెక్నాలజీలో హీరోలను తెర మీద చాలా స్ట్రాంగ్ చూపించొచ్చు. ఈ నేపథ్యంలో తెర మీద ప్రభాస్‌ను మ్యాచ్ చేయడానికి ఏదైనా టెక్నాలజీ వాడారా అని ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు ని ప్రశ్నించగా ఆయన ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ప్రభాస్ తన రీసెంట్ మూవీస్ కోసం బాగా సన్నబడ్డాడు. కన్నప్ప షూటింగ్‌కు వచ్చినపుడు కూడా చాలా సన్నగా కనిపించాడు. అతణ్ని స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకోమంటే కుదరదని నాతో అన్నాడు. ఇప్పుడు నీలో నేను సగం ఉన్నాను స్లీవ్ లెస్ వేసుకుంటే బాగోదని అన్నట్లు విష్ణు తెలిపారు.అయితే ఈ వ్యాఖ్యలకి ప్రభాస్ ఫ్యాన్స్ మన విష్ణు అన్న గురించి తెలిసిందేగా అని కామెంట్స్ చేస్తున్నారు..

 

Related posts

ఎన్టీఆర్ నీల్ మూవీ టైటిల్ పై బిగ్ అప్డేట్ వైరల్..!!

murali

సెన్సార్ పూర్తి చేసుకున్న “తండేల్”.. రన్ టైం ఎంతో తెలుసా..?

murali

రాజాసాబ్ : టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

Leave a Comment