Prabhas Spirit to have new age scenes
MOVIE NEWS

స్పిరిట్…. యూత్ కి కనెక్ట్ అయ్యే పాయింట్ తోనే

Prabhas Spirit to have new age scenes
Prabhas Spirit to have new age scenes

Prabhas Spirit : ఏ ఫీల్డ్ లో అయినా సమయానికి తగ్గట్టు అప్ డేట్ అవ్వడం ముఖ్యం. అది ఇప్పుడు సినీ ఫీల్డ్‌కి ఎక్కువ అవసరం.ఎంతో మంది గొప్ప దర్శకులు వల్లని వాళ్ళు అప్‌డేట్ చేసుకోక వెనకబడి పోయారు. అందుకే ఇప్పుడు వస్తుంది కొత్త డైరెక్టర్స్ ఫుల్ అప్‌డేట్ గా ఉన్నారు.

అందుకే వాళ్ల కొత్త సినిమాల్లో ఆ టైమ్‌కి తగ్గట్టు చాలా మంచి పాయింట్స్ తో కథలు తీస్తున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ చివరి నాటికి పూర్తవుతుందని సమాచారం. ‘రాజా సాబ్’ పూర్తి చేసిన తర్వాత ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు.

ఈ సినిమా సెట్స్ లోకి వచ్చే నెలలో చేరనున్నారట. ప్రభాస్ ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్‌లను ముగించిన తర్వాత, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందబోయే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’ లో కనిపించనున్నారు. ఈ చిత్రం పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది మొదటి ప్రారంభమవుతుంది.

అసలైతే ఈ ఏడాది చివరలోనే స్టార్ట్ కావాల్సింది. కానీ సందీప్ వంగా ‘స్పిరిట్’ స్క్రిప్ట్‌ని పూర్తి చేయడానికి మరికొంత సమయం కోరారు. ప్రభాస్ కూడా తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి మరికొంత సమయం అడిగినట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక రుథ్‌లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ సినిమా లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గ స్టోరీ పాయింట్ తోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. డ్రగ్ మాఫియాపై హీరో పోరాటాన్ని ఆధారంగా చేసుకొని రూపొందనుందట. దేశవ్యాప్తంగా యువత డ్రగ్స్ కు బలవుతున్న నేపథ్యంలో, ఈ సమస్యపై ప్రభాస్ పాత్ర శక్తివంతంగా నిలవనుంది. ముఖ్యంగా ముంబై నగరంలో విస్తరించిన డ్రగ్ మాఫియాపై ప్రభాస్ పోరాటం ఈ చిత్రంలో ప్రధాన అంశం కానుంది.

Read Also : వంశీ పైడిపల్లి తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా

ఇందులో ప్రభాస్ స్టైలిష్ పోలీస్ గెటప్‌లో ఫిట్నెస్ లుక్ లో కనిపించబోతున్నారు. ముంబై నగరంలో ప్రభాస్ గ్యాంగ్‌స్టర్లను ఎదుర్కొనే యాక్షన్ సీక్వెన్సులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఆయన నటన ఈ సినిమాలో యాక్షన్ స్థాయిని మరింత పెంచుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాను ‘టీ సిరీస్’ మరియు ‘భద్రకాళి పిక్చర్స్’ నిర్మిస్తున్నాయి.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్న ఈ సినిమా, పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యేలా రూపొందించనున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’ వంటి సినిమాలు పూర్తి చేసిన తర్వాత, పూర్తి స్థాయిలో ‘స్పిరిట్’ లో నటించనున్నారు. అలాగే సినిమాలో మెగాస్టార్ కూడా కనిపించబోయే అవకాశాలు ఉన్నాయని ఒక బలమైన టాక్ వినిపిస్తోంది. అలాగే పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా భాగం కానున్నట్లు గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Follow us on Instagram

Related posts

ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్.. లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో..?

murali

ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్..?

murali

మంచు వారింట్లో మళ్ళీ రచ్చ.. క్లారిటీ ఇచ్చిన పిఆర్ టీం..!!

murali

Leave a Comment