పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి..వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “రాజా సాబ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తెర కెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉంది..కానీ షూటింగ్ డిలే కావడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.అయితే రానున్న రెండేళ్లలో ప్రభాస్ నుంచి మూడు సినిమాలు వస్తాయి. రాజా సాబ్ ఈ సెప్టెంబర్ లో రిలీజ్ కానుందని తెలుస్తుంది.. అలాగే హనురాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ నటించే స్పిరిట్ మూవీ కూడా వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ కానుంది..
RC16 : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చరణ్ బర్త్డే బిగ్ అప్డేట్..!!
ప్రస్తుతం రాజా సాబ్ మూవీ షూటింగ్ దాదాపు చివరి స్టేజ్ కి వచ్చింది… అలాగే ఫౌజీ సినిమా షూటింగ్ కూడా సగానికి పైగా అయిపోయింది. దీనితో ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ ని కంబైన్డ్ గా కంప్లీట్ చేయనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.అయితే స్పిరిట్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఇదిలా ఉంటే స్పిరిట్ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ బాగా వైరల్ అవుతుంది..స్పిరిట్ సినిమాను ఈ ఉగాదికి అఫీషియల్ గా ప్రారంభించబోతున్నట్లు సమాచారం.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సమ్మర్ నుంచే షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.ఇప్పటికే ప్రభాస్ ను సందీప్ బల్క్ డేట్స్ ను అడిగినట్లు సమాచారం.. అయితే మూడు సినిమాలకు ప్రభాస్ తన డేట్స్ ని అడ్జస్ట్ చేయనున్నాడని తెలుస్తుంది. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తున్నాడు.. ప్రభాస్ తన కెరీర్ లో మొదటిసారి పోలీస్ గా నటిస్తున్నాడు.. ఈ సినిమాలో ప్రభాస్ కి ధీటుగా పవర్ ఫుల్ విలన్ ను సందీప్ సెట్ చేస్తున్నాడట.. ఈ సినిమా సందీప్ పాత సినిమాల కంటే మరింత వైలెంట్ గా ఉంటుందని సమాచారం..