MOVIE NEWS

ప్రభాస్ ” స్పిరిట్” షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.. గత ఏడాది “ కల్కి 2898 AD “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ తన కెరీర్ లో మరో భారీ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. త్వరలోనే ఈ సినిమాకు సెకండ్ పార్ట్ ను మేకర్స్ మొదలు పెట్టనున్నారు.

కెన్యా అడవుల్లో “SSMB” షూటింగ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!!

ఇదిలా ఉంటే ప్రభాస్ స్టార్ డైరెక్టర్  సందీప్ రెడ్డి వంగతో “స్పిరిట్ “ అనే పవర్ఫుల్ మూవీ చేయబోతున్నాడు.. ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగా చేసిన సినిమాల కంటే మరింత పవర్ఫుల్గా స్పిరిట్ మూవీ ఉండబోతోంది.సందీప్ గత చిత్రం యానిమల్ లో రణ్ బీర్ ని ఎంతో వైలెంట్ గా చూపించాడు.. అది జస్ట్ శాంపిల్ మాత్రమే అని స్పిరిట్ లో అంతకు మించి ఉంటుందని సందీప్ తెలిపాడు..

అంతే కాకుండా ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ కూడా చేయబోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. ఇప్పటివరకు ఎవ్వరూ చూపించని విధంగా..సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌ని సరికొత్త కోణంలో చూపించబోతున్నాడని సమాచారం..ఇంతవరకు బాగానే వుంది కానీ ఈ సినిమా షూటింగ్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. నిజానికి గతేడాది చివర్లోనే స్పిరిట్ మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా వేశారు. రానున్న మార్చి నెలలో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది.. ఆ తర్వాత సమ్మర్‌లో రెగ్యూలర్ షూటింగ్‌కు వెళ్లనున్నట్టు సమాచారం… తాజాగా ప్రభాస్‌తో లుక్ టెస్ట్‌ షూట్ గురించి సందీప్ డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది…త్వరలోనే ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ రానుంది..

 

Related posts

స్పిరిట్ : ప్రభాస్ కి సరికొత్త కండీషన్ పెట్టిన సందీప్ వంగా..?

murali

దృశ్యం – ది కంక్లూషన్

filmybowl

తెలుగులో గ్రాండ్ రిలీజ్ కు సిద్దమవుతున్న బ్లాక్ బస్టర్ “ఛావా”..!!

murali

Leave a Comment