రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’.. డార్లింగ్ ఫ్యాన్స్ లో ఈ చిత్రానికి భారీ క్రేజ్ వుంది..ప్రభాస్ అభిమానులు ‘స్పిరిట్’ పేరు కనిపిస్తేనే ఊగిపోతున్నారు… సందీప్ వంగా లాంటి ఊర మాస్ పాన్ ఇండియన్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అంటేనే ఫ్యాన్స్ అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి..అది గాక ఈ సినిమాలో కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ విలన్ గా నటిస్తున్నాడనే అనే వార్త వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఎక్సపెక్టేషన్స్ పీక్స్ కి చేరాయి..ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.. ఈ చిత్రం లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు..ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రను సందీప్ వంగా మరింత వైలెంట్ గా చూపించబోతున్నాడు.
నక్క తోక తొక్కిన రవితేజ బ్యూటీ..ఏకంగా ఆ స్టార్ హీరో సరసన లక్కీ ఛాన్స్..?
ఇదిలా ఉంటే ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో ఈ సినిమాలో ప్రభాస్ క్యారక్టర్ గెటప్ ఎలా ఉండబోతుంది అనే ఊహతో కొన్ని ఫోటోలను, వీడియోలను ఫ్యాన్స్ క్రియేట్ చేసారు.. ఇందులో ప్రభాస్ లుక్ అదిరిపోయింది..ప్రభాస్ నిజంగా నటించినట్లుగా స్టిల్స్ చాలా సహజం గా ఉన్నాయి. అయితే ప్రభాస్, డాన్ లీ లు స్పిరిట్ మూవీ సెట్స్ లో ఎలా ఉంటారు అనే దానిపై ఫ్యాన్స్ ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ని రిలీజ్ చేసారు.
ఈ వీడియో చాలా ఫన్నీ గా అనిపించింది.షూటింగ్ సెట్స్ లో భారీ ఫైట్స్ చేసి అలిసిపోయిన ప్రభాస్, రాత్రి తనతో పాటు డాన్ లీ ని ఫుడ్ పార్టీ కి తీసుకెళ్లడం.. ప్రభాస్ తనకి పొట్టపగిలేలా భోజనాలు పెట్టడంతో డాన్ లీ తట్టుకోలేక కడుపునొప్పితో హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్టు ఈ వీడియో ని చాలా ఫన్నీగా క్రియేట్ చేసారు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది..
Orey evadra chesindhi fb lo chusa 😂😂#Prabhas pic.twitter.com/OkPHsgmtLq
— Darling Fanss (@DarlingFanss1) February 17, 2025