పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ’ది రాజా సాబ్. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..ప్రభాస్ తన కెరీర్లో ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై హైప్ మరింత ఎక్కువగా ఉంది.ఈ క్రమంలో ‘ది రాజా సాబ్’ నుంచి క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. మారుతీ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ 2025 సెప్టెంబర్ 24న విడుదలవుతోందని సమాచారం.2025 ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ షూటింగ్ ఆలస్యం వంటి సమస్యల కారణంగా వాయిదా పడింది. అయితే, ఈ చిత్రాన్ని జూలై 18న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఓ రూమర్ వినిపించినా.. అది కూడా కుదర్లేదని సమాచారం.
చిరు-ఓదెల మూవీ బిగ్ అప్డేట్ ఇచ్చిన నాని..!!
పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా ‘ది రాజా సాబ్’ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది…ఈ లోపు ప్రభాస్ ఫ్యాన్స్ను కూల్ చేసేందుకు మే సెకండ్ వీక్లో మేకర్స్ టీజర్‌ను విడుదల చేయనున్నారట. అలాగే, ఈ సినిమా VFX క్వాలిటీతో టీమ్ అందరూ సంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది….
రానున్న టీజర్లో VFX ఎంతో అద్భుతంగా ఉంటుందని సమాచారం.. ఇదిలా ఉంటే.. ది రాజా సాబ్ షూటింగ్ ఇంకొన్ని పోర్షన్స్ మిగిలే ఉందని తెలుస్తుంది. కొన్ని పాటలతో పాటు క్లైమాక్స్ షూటింగ్ కూడా ఇంకా పెండింగ్‍లోనే ఉందని సమాచారం..అలాగే వీఎఫ్‍ఎక్స్ పనులకు కూడా మరికొంత సమయం కావాలని టీమ్ భావిస్తోందట. మరి త్వరలో రిలీజ్ కాబోయే టీజర్ లో అయినా రిలీజ్ డేట్ వెల్లడిస్తారో లేదో చూడాలి.
#TheRajasaab update:
Movie is releasing on 24th September 2025.
Teaser is going to release in between May 1st and 2nd week.
VFX quality tho Team andharu satisfied anta, teaser lo VFX chala baguntadi ani talk❤️🔥
pic.twitter.com/ktpufGAJoV— Legend Prabhas (@CanadaPrabhasFN) April 21, 2025