MOVIE NEWS

ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో వున్న బిగ్గెస్ట్ మూవీ స్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మాసీవ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో త్వరలో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ను ముందుగా ఏప్రిల్ 10 న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.. కానీ షూటింగ్ ఆలస్యం,సీజి వర్క్ పెండింగ్ లో ఉండటం వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.. త్వరలోనే ఈ సినిమా నూతన రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించనున్నారు..

ఆ మూడు సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్..!!

ఈ సినిమా లో హాట్ బ్యూటీస్ నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్స్ గా నటించారు..స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..ఓ ఆటోరిక్షాపై రాజాసాబ్‌లోని ప్రభాస్ ఫోటో ఉండటాన్ని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు ఆయన ‘అలర్ట్.. వేడి గాలులు మే లో మరింత పెరగనున్నాయి’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

దీంతో త్వరలోనే ‘రాజా సాబ్’ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ రానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ ఈ సినిమాతో పాటు హనురాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా నటిస్తున్నాడు.. అలాగే క్యూట్ బ్యూటీ ఇమాన్వి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతుంది..

Related posts

బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా..?

murali

ఎన్టీఆర్ తో పాటు సైఫ్ ని పొగిడితీరాల్సిందే

filmybowl

పెద్ది : చరణ్ మూవీ కోసం దేవిశ్రీ సాయం..?

murali

Leave a Comment