MOVIE NEWS

ప్రభాస్ ‘కల్కి ‘ పార్ట్ 2 బిగ్ అప్డేట్..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌ మూవీ “కల్కి 2898 ఏడీ”…వైజయంతీ మూవీస్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు..ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా గత ఏడాది జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.ఈ మూవీ గ్లోబల్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కల్కి విడుదల తేదీకి సంబంధించి తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ అప్‌డేట్ ఇచ్చారు.

అఖండ 2 బిగ్ అప్డేట్.. టీజర్ లోడింగ్..!!

‘కల్కి 2’ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని నాగ్ అశ్విన్ ని మీడియా ప్రశ్నించగా “’కల్కి’ని 3, 4 గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు రిలీజ్ చేశాను. దాని సీక్వెల్‌ను కూడా ఇప్పుడు 7, 8 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు విడుదల చేస్తాను. కాస్త ఆగండి అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చారు.ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్స్ గా నటించారు.. ఇండియన్ సినిమా లెజెండరీ యాక్టర్లు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.. అలాగే రాజేంద్రప్రసాద్‌, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ ఈ సినిమాలో విలన్‌గా నటించాడు.త్వరలో రాబోయే సీక్వెల్‌లో మరిన్ని ఇంట్రెస్టింగ్ పాత్రలు ఉండనున్నట్లు సమాచారం..ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ సినిమా షూటింగ్స్ తో బిజీగా వున్నాడు..

 

Related posts

ఆయనతో టైం స్పెండ్ చేయడం ఇష్టం.. దిల్ రాజు వైఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ ఏకంగా అన్ని కిలోల బరువు తగ్గనున్నాడా..?

murali

కన్నప్ప : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?

murali

Leave a Comment