ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరి కొత్త రికార్డు క్రియేట్ చేసిన సినిమా “ కల్కి 2898 AD”. బిగ్గెస్ట్ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ గ్రాండ్ విజువల్ వండర్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది..గత ఏడాది ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా బాలీవుడ్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినిదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు..
పవర్ స్టార్ “ఓజీ” టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!
ఈ సినిమాలో అమితాబ్ అశ్వద్ధామ పాత్రలో నటించగా కమలహాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో అద్భుతంగా నటించారు..అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీస్, దీపికా పడుకోణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు..కల్కి 2898 AD మొదటి భాగం భారీ విజయం సాధించడంతో ఈ సినిమా రెండో పార్ట్‌పై అంతకంటే భారీగా అంచనాలు పెరిగాయి. ఇప్పటికే సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచుతూ టీమ్ గ్రాండ్ టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ నెల 23న కల్కి 2898 AD జీ తమిళ్‌లో సాయంత్రం 3 గంటలకు ప్రసారం కానుంది. కల్కి సినిమాకు ఓటీటీలో కూడా మంచి ఆదరణ లభించింది.ఇప్పుడు టెలివిజన్ ప్రేక్షకులకు అద్భుత అనుభూతిని అందించనుంది..
ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వర్చువల్ 3D ప్రోమోను విడుదల చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ లేటెస్ట్ 3D ప్రోమో విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కొత్తగా 3D టెక్నాలజీతో ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు ప్రెజెంట్ చేశారు. ప్రస్తుతం ఈ విజువల్ ట్రీట్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు..