Prabhas Kalki 2898 AD Movie Full Review
MOVIE REVIEWS

కల్కి 2898 ఏడీ  మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

Prabhas Kalki 2898 AD Movie Full Review
Prabhas Kalki 2898 AD Movie Full Review

Prabhas Kalki 2898 AD Review :

కల్కి 2898 ఏడీ  (Prabhas Kalki 2898 AD) మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

తారాగణం: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, శోభన, సస్వత ఛటర్జీ, దిశా పఠాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి తదితరులు
ప్రొడక్షన్: వైజయంతి మూవీస్
ప్రొడ్యూసర్స్: అశ్వనీదత్ చలసాని
రైటర్ & డైరేక్షన్: నాగ్ అశ్విన్
మ్యూజిక్: సంతోష్ నారాయణన్
రిలీజ్ డేట్: జూన్ 27, 2024
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన చిత్రం కల్కి. భారతీయ చలనచిత్ర గర్వించదగ్గ దిగ్గజాలైన అమితాబ్ బచ్చన్ , కమల్ హస్సన్ , ప్రభాస్ లని ఒకచోటికి చేర్చి మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం లో అశ్వినీదత్ నిర్మించిన భారీ సైఫై ఫాంటసీ చిత్రం ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ అంచనాలను ‘కల్కి’ ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:
కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వెల సంవత్సరాలు తర్వాత ఈ భూమి మీద కాశీ చివరి నగరంగా మారి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. తినడానికి తిండి, తాగడానికి గుక్కెడు నీళ్లు లేక జనం అల్లాడిపోతుంటారు. దీనికి అన్నిటికి కారణం సుప్రీమ్ యాస్మిన్ (కమల్). ప్రజల దగ్గరున్న వనరులన్నీ లాగేసుకొని కాంప్లెక్స్ అనే మరొక ప్రపంచం కట్టేసుకుని నియంతలాగా పరిపాలిస్తుంటాడు. ప్రపంచం లో ఎక్కడ లేని సౌకర్యాలు అన్ని ఆ కాంప్లెక్స్ లోనే ఉండటం తో ప్రతిఒక్కరు ఆ కాంప్లెక్స్ లో అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అలా ప్రయత్నించే వాళ్లలో భైరవ (Prabahs) ఒకడు.

సుప్రీమ్ యాస్కీన్ చేస్తున్న ఓ ప్రయోగంలో సుమతి (దీపికా పదుకొనే) గర్భవతి అవుతుంది అక్కడి నుంచి తప్పించుకుని బయటికి వచ్చేస్తుంది. శంబాలా అనే మరో ప్రపంచానికి చెందిన రెబల్స్ సుప్రీమ్ యాస్కిన్ చేస్తున్న అన్యాయాల్ని ఎదురించి కాంప్లెక్స్ వనరులని అందరికి పంచాలని శంబాలా అనే మరొక రహస్య ప్రపంచాన్ని సృష్టించుకొని అక్కడ నుంచి యుద్ధం చేస్తుంటారు. కాంప్లెక్స్ నుంచి తప్పించుకున్న సుమతి కి శంబాలా ప్రజలు అండగా నిలుస్తారు. వీళ్ళతో పాటు అశ్వత్థామ (అమితాబ్) సైతం సుమతి కి రక్షకుడిగా మారతాడు. సుమతిని అప్పగిస్తే కాంప్లెక్స్ కు వెళ్లే అవకాశం వస్తుందని తెలుసుకున్న భైరవ.. సుమతి ని శంబాలా నుంచి తీసుకురావడానికి అక్కడకి వెళ్తాడు. అక్కడకి వెళ్లిన భైరవ…. అశ్వత్థామ తో పాటు శంబాలా నగర ప్రజలని ఎదిరించడానికి సిద్ధపడతాడు. ఈ పోరాటంలో ఎవరు గెలిచారు.. అస్సలు అశ్వత్థామ ఎవరు, అన్ని వేల సంవత్సరాలు ఎలా జీవించాడు ,సుమతి ని అశ్వత్థామ ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితేంటి , సుప్రీమ్ యాస్కిన్ మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఏంటి, అస్సలు భైరవ కి అశ్వత్థామ కి సంబంధం ఏంటి… ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కల్కి ఎలా ఉంది
సిల్వర్ స్క్రీన్ పైన అద్భుతాలు సృష్టించడం అందరికి అయ్యే పని కాదు. అది కొద్దీ మందికి మాత్రమే దక్కే అదృష్టం. ఆ అదృష్టం, కష్టం నాగ్ అశ్విన్ బాగానే పడ్డాడు. భారీ కధలు చెప్పడం లో రాజమౌళి దిట్ట , విసువల్ ఎఫెక్ట్ వాడుకోడం లో రాజమౌళి ఒక స్టాండర్డ్స్ సెట్ చేసాడు , ఒక ప్రపంచాన్ని సృష్టించడంలో రాజమౌళి కి సాటి లేరు అనే దగ్గర నుంచి నాగ్ అశ్విన్ కూడా రాజమౌళి లాగ బానే తీసాడే , కొన్ని చోట్ల రాజమౌళి కంటే బానే తీసాడే అని అనిపించుకుంటాడు అనడంలో సందేహం లేదు
అన్నిటిని బాగానే చేసుకొచ్చిన దర్శకుడు కథ చెప్పడం లో మాత్రం కూసింత వెనకపడ్డాడు. బహుశా part2 కోసం దాచి ఉంటాడు అనుకోవచ్చు కానీ నాగ్ అశ్విని కి ప్రధాన బలమైన కథ చెప్పడం లో మాత్రం కాస్త వెనకపడ్డాడు. ఆలా అని ఈ సినిమా ని తీసి పడేయలేం
ఈ కథ పెద్దది పాత్రలు పరిచయం అవసరం, స్టోరీ సెట్ చేయడం అవసరం. ఈ పార్ట్ మొదటి సగం లో దర్శకుడు అదే పని చేసాడు.
పురాణాల్లోని పాత్రలని తీసుకొని , దానికి ఫిక్షన్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్ ని తలపించే విధంగా తీర్చిదిద్దాడు. కొత్త ప్రపంచాలని ఎంతో కొత్తగా సృష్టించాడు

కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగే పరిణామం నుంచి ఈ కథ మొదలుపెట్టాడు దర్శకుడు. ఆ వెంటనే ఆరు వేల సంవత్సరాల ముందుకి వెళ్ళిపోయి కొత్త ప్రపంచాలని చూయిస్తూ సినిమా ని ముందుకు నడిపాడు. భారీ ఫైట్ సీక్వెన్స్ తో ప్రభాస్ ఎంట్రీ ఉంటది. ప్రభాస్ & బుజ్జి (కీర్తి సురేష్ వాయిస్) కామెడీ టైం పాస్ అవుతుంటది. ఆన్నిపాత్రలని పరిచయం చేసుకుంటూ మొదటి సగం నింపాదిగా నడిపిన దర్శకుడు రెండో సగం లో ఆ తప్పు చేయలేదు
అమితాబ్ – ప్రభాస్ మధ్య ఫైట్ ఆకట్టుకుంటుంది, ఆ తర్వాత శంబాలా కి వెళ్లడం అక్కడ అమితాబ్ తో మహాభారతం కథని చెప్పించడం. ఎంతో మంది తెలిసిన స్టార్స్ ఈ సినిమా లో ప్రతి ఐదు నిమిషాలకి ఎదురుపడటం చూడ ముచ్చటగా ఉంటుంది.

ఇప్పటి దాకా ఒక ఫ్లో లో నడిచిన సినిమా చివరి 20 నిమిషాలు మాత్రం ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. వచ్చే సన్నివేశం, ఇచ్చే ఎలేవేషన్ , తెర మీద కనపడే గ్రాఫిక్స్ అత్యద్భుతం అనే చెప్పాలి. క్లైమాక్స్ లో ప్రభాస్ మరొక పాత్ర ని ప్రవేశపెట్టిన విధానం చెప్పడం కంటే చూసి తీరాల్సిందే

Read Also :  నాని – మాస్టర్ క్లాస్ సక్సెస్ ఫుల్ హీరో

నటీనటులు ఎలా చేసారంటే
ఎవరేం అనుకున్న ప్రభాస్ కంటే ఈ పార్ట్ లో అమితాబ్ పాత్రకే ఎక్కువ స్కోప్ ఉండటం గమనించాలి
అది ఒప్పుకొని సినిమా ని ముందుకు తీసుకెళ్లిన ప్రభాస్ అభినందనీయుడు. గత 15 ఏళ్లలో అమితాబ్ ని ఇంత పవర్ఫుల్ గా ఎవరు చూపించలేదు అంటే అతిసేయోక్తి కాదు. ఇక ప్రభాస్ కామెడీ టైమింగ్ , యాక్షన్ ఘట్టాల్లో ఇరగదీసాడు అనే చెప్పుకోవాలి. సుప్రీమ్ యాస్కిన్ గా కమల్ గేతుప్ బావుంది కాకపోతే ఆ పాత్ర నిడివి ఈ పార్ట్ లో చాల తక్కువ. గర్భిణీ గా దీపికా నటన ఆకట్టుకుంటది. శంబాలా ప్రపంచానికి చెందిన రెబెల్స్ గా శోభన , రాజేంద్రప్రసాద్ , అన్నబెన్ , పశుపతి పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు

నాగ అశ్విన్ టీం వర్క్ సూపర్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ , సంగీతం, విసువల్ ఎఫెక్ట్స్ పనితనం కనపడుతుంది.
అశ్వనీదత్ ఖర్చుకి వెనకాడకుండా ఇంత భారీ సినిమా ని ప్రేక్షకులకి అందించడం లో ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే

చివరగా
కల్కి – ప్రపంచ సినిమా చరిత్రలో నిలిచిపోయే తెలుగు సినిమా
Filmy Bowl Rating: 3.75/5

Follow us on Instagram

Related posts

మత్తువదలరా2 మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

filmybowl

‘వేట్టయాన్’ మూవీ రివ్యూ

filmybowl

దేవర మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

filmybowl

Leave a Comment