Prabhas Fans Get Ready for Thriple Dhamakha..
MOVIE NEWS

ట్రిపుల్ ధమాకా కి సిద్దం అవ్వండి రెబల్ ఫ్యాన్స్

Prabhas Fans Get Ready for Thriple Dhamakha..
Prabhas Fans Get Ready for Thriple Dhamakha..

Prabhas Fans Thriple Dhamakha : పాన్ ఇండియా మెగా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ హర్రర్ కామెడీ మూవీ ప్రభాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలవనుంది. పాన్ ఇండియా రేంజ్ కి చేరుకున్నాక సాధారణంగా మాస్, యాక్షన్ జోనర్‌లో ఎక్కువగా కనిపిస్తున్న ప్రభాస్.. ఈసారి హర్రర్ టచ్‌తో కామెడీ జోనర్‌లో అందరినీ భయపెడుతూ నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకూ ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు అభిమానులకి భాగా నచ్చేశాయి, టీజర్లు సినిమాపై భారీ హైప్‌ క్రియేట్ చేశాయి.

ముఖ్యంగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంపురస్కరించుకొని అక్టోబర్ 23న విడుదలైన మోషన్ పోస్టర్ అభిమానులకు కిక్ ఇచ్చింది. ఇందులో ప్రభాస్, ఊహించని విధంగా రాజవారిగా ఒక వృద్ధుడి గెటప్‌లో కనిపించడంతో, ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా, ప్రభాస్ ఈ సినిమాలో డ్యుయల్ రోల్ చేస్తూ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారనే టాక్ ఉన్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఆయన మూడు భిన్న గెటప్స్‌లో దర్శనమివ్వబోతున్నారని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో కంప్లీట్ గా రాజ్ సాబ్ రాజ్యం హైలెట్ అవుతుందట.

ఇక ప్రస్తుత కాలంలో స్టైలిష్ యంగ్ రెబల్ స్టార్ దర్శనమివ్వనున్నాడు. తాత మనవళ్ళుగా ప్రభాస్ రోల్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇక రాజా సాబ్ ఆత్మ గెటప్ లో ప్రభాస్ లుక్ నిన్న విడుదల చేసిందే. సెకండ్ హాఫ్ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందట. దర్శకుడు మారుతి తనదైన శైలిలో హర్రర్, కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను మెప్పించేలా స్క్రిప్ట్‌ను తయారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం ఏప్రిల్ 2025లో విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read :  బేబమ్మ ఆశలన్నీ వాళ్ళ మీదే..!

యస్ యస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తానికి ‘ది రాజా సాబ్’లో ప్రభాస్ డిఫరెంట్ షేడ్స్ తో సర్ ప్రైజ్ చేయబోతున్నారని వస్తున్న టాక్ అభిమానులకు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరి డార్లింగ్ ఎంతవరకు మెప్పిస్తారో తెలియాలంటే మాత్రం సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

Follow us on Instagram 

Related posts

అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ కానున్న కల్కి.. బ్యాలన్స్ రికార్డ్స్ కూడా వదలట్లేదుగా..!!

murali

పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్ళేది ఎప్పుడంటే..?

murali

డాకు మహారాజ్ : అసలు విలన్ ఆయనే..బాలయ్య ఫ్యాన్స్ కి బాబీ బిగ్ సర్ప్రైజ్ ..!!

murali

Leave a Comment