MOVIE NEWS

ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్, యంగ్ టైగర్.. భారీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్న ఆ తమిళ్ స్టార్ డైరెక్టర్..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బాహుబలి సినిమాతో గ్లోబల్ వైడ్ మార్కెట్ సంపాదించుకున్న ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ మూవీస్ చేస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి..త్వరలోనే వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని అలరించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు.. ఇదిలా ఉంటే ప్రభాస్ తో పాటే పాన్ ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మరో స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి హాలీవుడ్ డైరెక్టర్స్ ని సైతం మెప్పించిన ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ ఫుల్ పాపులరిటీ తెచ్చు కున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ సైతం భారీ సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు..

NTR-NEEL: వికారాబాద్ అడవుల్లో షూటింగ్..లొకేషన్స్ వేటలో ప్రశాంత్ నీల్..!!

ఈ ఇద్దరి పాన్ ఇండియన్ స్టార్స్ కి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వారి సినిమా రిలీజ్ అయిందంటే ఆ రోజు ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.వీరిద్దరూ విడివిడిగా సినిమాలు చేస్తేనే ఇంత క్రేజ్ ఉంటే అదే వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఆ సినిమా క్రేజ్ ఏ లెవెల్ లో ఉంటుందో ఉహించుకుంటుటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి..ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవడం ఖాయం..ఇలాంటి రేర్ కాంబినేషన్‌లో ఓ బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కబోతుందని సమాచారం..డార్లింగ్‌ ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలు అంటేనే ఫ్యాన్స్‌కు ఫుల్‌ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటిది ఆ ఇద్దరు హీరోలు కలిసి మూవీ చేస్తున్నారంటే టాక్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ సినిమా అవుతుంది…

ఇటీవల అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి.. ప్రభాస్‌, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిపి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పుడు ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా.. రాజ్‌కుమార్‌ చెప్పిన స్టోరీ లైన్‌ విన్నారట.. స్టోరీ లైన్ విన్న ప్రభాస్‌, జూనియర్ ఎన్టీఆర్‌ ఎక్సయిట్ అయ్యారని సమాచారం… కానీ ఇంకా ప్రాజెక్టు కన్ఫర్మ్ కాలేదని తెలుస్తుంది… తాము చేయాల్సిన సినిమాలు చాలా ఉండటంతో.. అవి పూర్తి అయ్యే వరకు వెయిట్‌ చేయాలని వారు చెప్పినట్లు సమాచారం..

 

Related posts

మెగాస్టార్ తో సినిమా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

భారీ రికార్డ్ కి అడుగు దూరంలో పుష్ప 2..ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా..?

murali

గేమ్ ఛేంజర్ : రాంచరణ్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

murali

Leave a Comment