MOVIE NEWS

పుష్ప 3 నుంచి పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. మాములుగా లేదుగా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన మరోసారి నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ “సామ్ సిఎస్” అడిషనల్ బిజిఎం అందించారు.. ప్రస్తుతం ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. రిలీజ్ అయిన మొదటి షో నుంచే పుష్ప సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభించింది.. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 1600 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.. త్వరలో బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేయనుంది.

అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ కానున్న కల్కి.. బ్యాలన్స్ రికార్డ్స్ కూడా వదలట్లేదుగా..!!

ఇదిలా ఉంటే ఈ సినిమా ఎండింగ్ లో పుష్ప 3 కూడా ఉండబోతుంది అంటూ మేకర్స్ అద్భుతమైన లీడ్ ఇచ్చారు. ఇక ఇప్పుడు దానికి సంబంధించిన ఒక డైలాగ్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే పుష్ప 3 సినిమాకు సంబంధించిన కొంత పార్ట్ షూట్ ని కూడా మేకర్స్ పూర్తి చేశారట. అయితే మిగతా షూట్ మొత్తాన్ని మరో రెండు సంవత్సరాల తర్వాత చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ప్రస్తుతం అల్లు అర్జున్ కమిట్ అయిన సినిమాలు అలాగే సుకుమార్ కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసి ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఇప్పటివరకు షూట్ చేసిన భాగంలో టెక్నీషియన్ల ద్వారా ఒక డైలాగ్ అయితే బయటకు లీక్ అయింది. ఇక ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.ఇంతకీ ఆ డైలాగ్ ఏంటి అంటే పుష్పని చంపడానికి కొంతమంది బిహారీ రౌడీలు తన ఇంటి మీదికి వచ్చినప్పుడు పుష్ప వాళ్ళను కొట్టి ‘పుష్పని వేసేయ్యాలంటే ప్లాన్ ఒక్కటే ఉంటే సరిపోదబ్బా గుండెల్లో ధైర్యం కూడా ఉండాలి… ఎవడు పడితే వాడు వచ్చి పొడిస్తే పోవడానికి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా కాదు ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్’ అంటూ పుష్ప చెప్పే డైలాగ్ అదిరిపోతుంది

Related posts

బాలయ్య “డాకు మహారాజ్ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?

murali

ఆ సినిమా విషయంలో చాలా బాధ పడ్డా..బాబీ షాకింగ్ కామెంట్స్..!!

murali

పుష్ప 2 : సెన్సార్ కత్తెరించిన సన్నివేశాలు ఏమిటో తెలుసా ..?

murali

Leave a Comment