MOVIE NEWS

ఆ స్టార్ హీరో బ్యానర్ లో పవర్ స్టార్ లేటెస్ట్ మూవీ..!!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. బిగ్గెస్ట్ పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతున్న ఈ సినిమాను ఏ ఎం రత్నం ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఆయన పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా మిగిలిన భాగాన్ని దర్శకత్వం వహించాడు.. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ముగించుకున్న కానీ ఈ సినిమా రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు..వాయిదాలు మీద వాయిదాలు పడుతూ మొత్తానికి జులై నెల 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.పాన్ ఇండియా భాషలలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను కేరళలో ఓ ప్రముఖ హీరో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు.

AA22 : షూటింగ్ పై బిగ్ అప్డేట్.. ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే..?

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వే ఫారర్ ఫిలిమ్స్ బ్యానేర్ పై కేరళలో అనేక సినిమాలు నిర్మించాడు. అలాగే ఎన్నో సినిమాలను తన బ్యానర్ పై రిలీజ్ చేసాడు. ఇప్పడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లును కూడా మల్లూ వుడ్ లో దుల్కర్ సల్మాన్ సంస్థ గ్రాండ్ రిలీజ్ చేయబోతుంది. ఈ విషయాన్నీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. దీనితో కేరళలో పవన్ కళ్యాణ్ సినిమాకు బిగ్ రిలీజ్ దొరికినట్లయింది..అలాగే తెలుగు రాష్ట్రాల రిలీజ్ కు సంబంధించి మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తుం డగా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ ఎం. ఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.

Related posts

రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు.. వైరల్..!!

murali

‘డాకు మహారాజ్’ షో కు ‘గేమ్ ఛేంజర్’..ఆఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఆహా టీం..!!

murali

Alcohol : మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న అల్లరోడు.. ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా..!!

murali

Leave a Comment