MOVIE NEWS

మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. స్వర్గీయ నందమూరి తారకరామారావు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య తన తండ్రి తో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.. అలాగే సోలో హీరోగా బాలయ్య తన కెరీర్ లో భారీ హిట్స్ అందుకున్నారు..హీరోగా బాలయ్య ఇటీవల 50 సంవత్సరాల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నారు.. ఇదిలా ఉంటే బాలయ్య తోటి హీరోలు చిరంజీవి, నాగార్జున వంటి స్టార్స్ తనయులు కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అద్భుతంగా రానిస్తున్నారు..

దీనితో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల లో కి వస్తారని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు.. ఎట్టకేలకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్‌మెంట్ అయ్యింది.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు బాలయ్య ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ప్రశాంత్ వర్మా డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమా రానుందని ఫ్యాన్స్ అంతా ఎంతో సంబరపడ్డారు. ఈ క్రమంలోనే బాలయ్య ఫ్యాన్స్ లో ఈ సినిమాపై విపరితమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా.. రీసెంట్ గా సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బాగా వైరల్ అవుతుంది..

గేమ్ ఛేంజర్ : ట్విస్టుల మీద ట్విస్టులు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్..!!

ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫేవరేట్ హీరోయిన్ నటించబోతుందంటూ న్యూస్ బాగా వైరల్ గా అయింది..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే గోవా బ్యూటీ  ఇలియానా. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లో ఇలియానా.. కీ రోల్‌లో కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..అయితే మొదట ప్రశాంత్ వర్మ ఈ సినిమాలో నెగటివ్ రోల్‌ కోసం ఇలియానా ను తీసుకోవాలని భావించినా తర్వాత బాలయ్య సజెషన్‌ తో నెగిటివ్ రోల్ కాకుండా.. సినిమాను టర్న్ చేసే ఓ పాత్ర కోసం ఇలియానాని తీసుకోనున్నట్లు సమాచారం..త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు..

Related posts

డాకు మహారాజ్ : అసలు విలన్ ఆయనే..బాలయ్య ఫ్యాన్స్ కి బాబీ బిగ్ సర్ప్రైజ్ ..!!

murali

“గేమ్ ఛేంజర్” పట్టించుకోవట్లేదుగా..ఇంకా పుష్ప రాజ్ దే హవా..!

murali

“విశ్వంభర” హడావుడి తగ్గడానికి కారణం అదేనా..?

murali

Leave a Comment