MOVIE NEWS

పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తూనే వరుస సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.. ప్రస్తుతం రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.పవన్ లైనప్ లో మూడు భారీ సినిమాలు వున్నాయి.. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొనగా ఆ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసారు.. వరుస వాయిదాలు పడి ఎట్టకేలకు ఈ సినిమా జూన్ 12 న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు..

వార్ 2 : గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్.. ఎన్టీఆర్ లుక్ అదిరిందిగా..!!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో మరో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘పవర్ స్టార్ యొక్క ఉత్తమ ప్రదర్శనలను జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి.. ఇది చాలా సంవత్సరాలు గుర్తుండిపోతుంది మరియు దీన్ని ఒక పండుగలా జరుపుకుంటారు.. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి’ అని వారు రాసుకొచ్చారు.

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది..ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.. గతంలో ఈ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. దీనితో ఈ సినిమా మ్యూజిక్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి..

Related posts

ట్రిపుల్ ధమాకా కి సిద్దం అవ్వండి రెబల్ ఫ్యాన్స్

filmybowl

కన్నప్ప : ప్రభాస్ పాత్ర నిడివిపై మంచు విష్ణు కీలక కామెంట్స్..!!

murali

మహేష్ తో చేసిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి పూర్తి బాధ్యత నాదే – వైట్ల

filmybowl

Leave a Comment