గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ నిర్మిస్తున్నాడు.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది..అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు..
అందరూ కలిసి బన్నీని ఒంటరి చేసారు.. సంధ్య థియేటర్ ఘటనపై పవన్ షాకింగ్ కామెంట్స్..!!
ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని కూడా చార్ట్ బస్టర్ గా నిలిచాయి..ఇదిలా ఉంటే ఈ సినిమా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍పైఫ్యాన్స్ లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్‍లో ఈ ఈవెంట్‍ను చరిత్ర సృష్టించేలా బిగ్గెస్ట్ మెగా ఈవెంట్‍లా నిర్వహిస్తామని నిర్మాత దిల్‍రాజు ఇటీవల తెలిపారు.దీంతో ఈ ఈవెంట్ పై భారీ హైప్ క్రియేట్ అయింది.ఇప్పటికే అమెరికాలోని డల్లాస్‍లో ఓ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఏపీలో భారీస్థాయిలో మరో ఈవెంట్ నిర్వహించేందుకు మూవీ టీమ్ సిద్ధమైంది.
గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు ముఖ్య అతిథిగా రావాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍ను నిర్మాత దిల్‍రాజు ఆహ్వానించారు. విజయవాడలో పవన్‍ను కలిసి ఈవెంట్‍కు పిలిచారు. ఈ ఈవెంట్‍కు హాజరయ్యేందుకు పవన్ కూడా అంగీకరించారు. దీంతో భారీ స్థాయిలో ఈ ఈవెంట్ ఉండే అవకాశం ఉంది. బాబాయి, అబ్బాయి ని ఫ్యాన్స్ ఒకే వేదికపై చూడొచ్చు. డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ హాజరుకానున్న తొలి మూవీ ఈవెంట్ ఇదే కావడం విశేషం.గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను జనవరి 4వ తేదీన రాజమండ్రిలో నిర్వహించాలని మూవీ టీమ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది