పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యానరిజంకు సరిపోయే సినిమా ఏదైనా వుంది అంటే వెంటనే గుర్తొచ్చే సినిమా బద్రి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సూపర్ హిట్స్ అందుకుంటున్న సమయం లో పూరి జగన్నాథ్ ని దర్శకునిగా పరిచయం చేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన సినిమా బద్రి.2000వ సంవత్సరంలో విడుదలైన ఈ బిగ్గెస్ట్ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో పవర్ స్టార్ ‘నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాధ్ అయితే ఏంటి.. అంటూ చెప్పిన డైలాగ్స్ యూత్ లో పిచ్చ క్రేజ్ ను తీసుకువచాయి. పవర్ స్టార్ నటించిన సినిమాలలో బద్రి సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలుస్తుంది..ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి బద్రి తన మాస్ మ్యానరిజం చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు.
ఓజీ డైరెక్టర్ సరికొత్త ప్రయోగం.. ఫ్యాన్స్ కి పండగే..!!
టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో బద్రి సినిమాను కూడా రిరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో రీరిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది..కానీ ఈ ఏడాది పవన్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న ఈ సినిమా రిరిలీజ్ చేసే ప్లానింగ్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం 4K ప్రింట్ పనులు జరుగుతున్నాయని సమాచారం.సూపర్ క్వాలిటీతో, పర్ఫెక్ట్ ఆడీయో లెవెల్ తో ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం.. అయితే రీ రిలీజ్ లలో పవర్ స్టార్ సినిమాలకు వున్న క్రేజ్ వేరు.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతాయి.. మరీ బద్రి సినిమా కూడా ఆ జాబితాలో చేరుతుందో లేదో చూడాలి..