మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమాకు ముందు నెగటివ్ టాక్ వచ్చినా కానీ ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఇంతటి క్రేజ్ రావడానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ సైతం ఒక కారణంగా చెప్పొచ్చు.. ఈ సినిమాకు అనిరుధ్ ఇచ్చిన బాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సట్రోర్డినరీ గా ఉంటుంది… ముఖ్యంగా ఈ సినిమాలో “చుట్టమల్లే” సాంగ్ సెన్సేషనల్ హిట్ అయింది.. ఇప్పటికీ కూడా ఈ పాట క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు..
చైతూ లైనప్ లో మరో భారీ సినిమా.. వర్కౌట్ అవుతుందా..?
నిన్న రాత్రి తన బెంగళూరు కన్సర్ట్ లో గ్లోబల్ పాప్ సెన్సేషన్ సింగర్ ఎడ్ సిరాన్ దేవర మూవీ నుండి చుట్టమల్లే రొమాంటిక్ సాంగ్ పాడి అందరిని ఆశ్చర్యపరిచాడు..ఈ పాట విన్న ఎన్టిఆర్ అభిమానులు సైతం సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.. ఎడ్ షీరాన్ చుట్టమల్లే పాట ప్రదర్శన సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది..అభిమానులతో పాటు తారక్ సైతం ప్రత్యేకంగా స్పందించాడు..ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్ చేసారు.., ‘సంగీతానికి సరిహద్దులు లేవు, మరియు మీరు దాన్ని మళ్ళీ నిరూపించారు, ఎడ్! మీరు తెలుగులో చట్టమల్లె పాడటం అనేది నిజంగా ప్రత్యేకమైనదని ఎన్టీఆర్ రాసుకొచ్చారు.. ప్రస్తుతం ఆ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది..
Wow This is Crazyyy Reach 💥💥#Chuttamalle from @edsheeran ❤️🔥❤️🔥@DevaraMovie @anirudhofficial @tarak9999 #Devara pic.twitter.com/RdhDmTvu60
— Tony (@NMeklaNTR) February 9, 2025