సంక్రాంతి సీజన్ కి ఫ్యామిలీతో కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీకోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు..అయితే ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కి బిగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే భాద్యత వెంకీ మామ తీసుకున్నాడు..వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తో వస్తున్నాం అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.. అయితే వెంకీ మామ, అనిల్ రావిపూడి కాంబినేషన్ కు ఫ్యాన్స్ లో వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..
‘డాకు మహారాజ్’ షో కు ‘గేమ్ ఛేంజర్’..ఆఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఆహా టీం..!!
గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్ 2’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘ఎఫ్ 3’సినిమా కూడా పర్వాలేదు అనిపించేలా ఆడింది. దీంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు పోటీగా రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలయ్య ‘డాకు మహారాజ్’ వంటి సినిమాలు కూడా వస్తుండటంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మేకర్స్ ప్రమోషన్స్ డోస్ పెంచారు..ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి చార్ట్ బస్టర్ గా నిలిచాయి..తాజాగా మూడో పాటను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. భీమ్స్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ‘బ్లాక్ బస్టర్ పొంగలు ‘ అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది..
ఈ సాంగ్ లో ప్రత్యేకత ఏమిటంటే ఈ సాంగ్ ని ఏకంగా వెంకటేష్ ఆలపించడంతో ఫ్యాన్స్ లో ఈ పాటకు మరింత క్రేజ్ ఏర్పడింది..ఈ పాటని వెంకీ మామ హుషారెత్తించే విధంగా పాడటమే కాకుండా.. ఇద్దరు హీరోయిన్లు అయినా మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్.లతో ఎనర్జిటిక్ స్టెప్స్ కూడా వేశాడు . సంక్రాంతి పండుగకి మరింత హైలెట్ అవ్వాలనే ఉద్దేశంతో మేకర్స్ పాటని రిలీజ్ చేసారు.. ప్రస్తుతం ఈ సోషల్ మీడియలో బాగా వైరల్ అవుతుంది…