టాలీవుడ్ లో ప్రస్తుతం వున్న స్టార్ హీరోలలో భారీగా మాస్ ఇమేజ్ వున్న హీరో ఎన్టీఆర్.. అందుకే ఆయనను ఫ్యాన్స్ అంతా “మ్యాన్ ఆఫ్ మాసెస్ “ ని పిలుచుకుంటారు.. ఎన్టీఆర్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వుంటారు..ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ “దేవర”.. ఈ సినిమాను మేకర్స్ రెండు పార్టులుగా తెరకెక్కించారు.. మొదటి పార్ట్ ను గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ రిలీజ్ చేసారు.. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కి ముందు ఎన్టీఆర్ ఇండియా వైడ్ భారీగా ప్రమోషన్స్ చేసారు..
AA22 : ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్.. వైరల్..!!
కానీ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయింది.. ఎన్టీఆర్ ఆరేళ్ళ తరువాత సోలో హీరోగా వస్తున్న సినిమా కావడం తో ఆ ఈవెంట్ కి ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు.దీనితో ఈవెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నా శ్రేయాస్ మీడియా చేతులెత్తేసింది.. దీనితో ఎంతో ఆశగా వచ్చిన ప్రేక్షకులు, అభిమానులు తీవ్ర నిరాశతో ఇంటికి వెళ్లారు.. ఆ తరువాత అయినా ఈవెంట్ ప్లాన్ చేయాలనీ చూసినా కుదర్లేదు.. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాట ఇచ్చారు. అభిమాన సోదరులను కచ్చితంగా ఓ సందర్బంలో కలుస్తానని చెప్పారు..తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసారు..
తాజాగా తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ కార్యక్రమానికి అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి, అభిమానులు ఓర్పుగా ఉండాలని ఎన్టీఆర్ కోరారు..ఈ నేపథ్యంలో, అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయవద్దని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేసారు..తన అభిమానుల ఆనందమే కాదు, వారి శ్రేయస్సు కూడా తనకు అత్యంత ప్రధానం అని ఎన్టీఆర్ తెలిపారు…