MOVIE NEWS

పెద్ది : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది.. ఫస్ట్ షాట్ మైండ్ బ్లోయింగ్..!!

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రలలో నటిస్తున్నారు..ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న రాంచరణ్ ఈ సినిమాతో ఎలాగైన మాస్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు..

పుష్ప 2 ఎఫెక్ట్… ఆర్య 2 రీ రిలీజ్ కు భారీ బందోబస్త్..!!

ఇటీవల రాంచరణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమాలో రాంచరణ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు..ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాంచరణ్ ఊర మాస్ లుక్ లో కనిపించారు.. ఈ సినిమా విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.. ఈ సినిమాలో సర్ ప్రైజింగ్ ఫస్ట్ షాట్  గ్లింప్స్ ని చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు.. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ చేయలేదు.. ఉగాది సందర్భంగా అయినా వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూసారు.. కానీ అప్పుడు కూడా ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది..తాజాగా నేడు శ్రీరామనవమి సందర్బంగా మేకర్స్ ఈరోజు ఉదయం 11.45 గంటలకు ఫస్ట్ షాట్ తో పాటు, రిలీజ్ డేట్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసారు..

రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది.. చరణ్ ఊర మాస్ లుక్ లో కనిపించారు..ఉత్తరాంధ్ర యాసలో చరణ్ డైలాగ్స్ అదర గొట్టారు.. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.గ్లింప్స్ చివరిలో చరణ్ క్రికెట్ ఆడే షాట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉంది.. ఈ సినిమాను మేకర్స్ మార్చి 27 న 2026 చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు..ఈ  సినిమాతో రాంచరణ్ సూపర్ హిట్ అందుకోవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

Related posts

“దేవర 2” కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్..షూటింగ్ ఎప్పుడంటే..?

murali

SSMB : భారీ ప్రెస్ మీట్ కి సిద్ధమవుతున్న రాజమౌళి..!!

murali

డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో మరో సర్ప్రైజింగ్ రోల్..ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

Leave a Comment