గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఈ ఏడాది “ గేమ్ ఛేంజర్” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది..స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.దీనితో తన తరువాత సినిమాపై పూర్తి ఫోకస్ చేసాడు.. రాంచరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో చేస్తున్నాడు.. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీకి “ పెద్ది “ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసి చరణ్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని సైతం రిలీజ్ చేశారు.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో చరణ్ మాస్ లుక్ లో కనిపించారు..
బాలయ్య మూవీపై.. మెగాస్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!
అయితే చరణ్ బర్త్ డే రోజునే ఈ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ కావాల్సి వుంది.. కానీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది.. ఉగాది కి అయినా వస్తుందనుకుంటే అప్పుడూ ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది.. అయితే గ్లింప్స్ వీడియో పై మేకర్స్ ఇటీవల బిగ్ అప్డేట్ ఇచ్చారు.. పెద్ది ఫస్ట్ షాట్ పేరుతో వస్తున్న ఈ గ్లింప్స్ వీడియో ఏప్రిల్ 6 వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు..
తాజాగా సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసి ఫస్ట్ షాట్ వీడియో రిలీజ్ కి ఇంకా రెండు రోజులే సమయం సిద్ధంగా ఉండాలంటూ ఫ్యాన్స్ కి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు..మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..