MOVIE NEWS

పెద్ది :చరణ్ మూవీ లో అదిరిపోయే ఐటమ్ సాంగ్.. ఆ స్టార్ హీరోయిన్ తో చర్చలు..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పెద్ది”.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో తెర కెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ రాంచరణ్ కెరీర్ లో 16 వ సినిమా గా తెర కెక్కుతుంది. చరణ్ నటించిన “ గేమ్ ఛేంజర్ “ సినిమా ప్రేక్షకులని నిరాశ పరచడంతో బుచ్చి బాబు సినిమా తో సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని చరణ్ చూస్తున్నాడు..తాజాగా రాంచరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ , ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు..తాజాగా రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ పోస్టర్ లో రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించారు.దర్శకుడు సుకుమార్ సైతం ఈ సినిమాకు కీలక సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం..

పవన్ “ఉస్తాద్ భగత్ సింగ్ ” మూవీ బిగ్ అప్డేట్..!!

ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్,జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు..ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..ఈ సినిమా కు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు పూర్తి చేసిన ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా అదిరిపోయే ఐటమ్ సాంగ్ రూపొందించబోతున్నట్లు సమాచారం.. పుష్ప మూవీ రేంజ్ లో అదరగొట్టే ఐటమ్ సాంగ్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట దీనికోసం హీరోయిన్ సమంతను సంప్రదించబోతున్నారని న్యూస్ వైరల్ అవుతుంది…

గతంలో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్, సమంత కలిసి నటించారు. ఆ సినిమా అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు పెద్దిలో ఐటమ్ సాంగ్ కోసం సమంతను సంప్రదించారని తెలుస్తుంది.. భారీగా రెమ్యూనరేషన్ కూడా ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారట. కానీ సమంత ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుంది.ప్రస్తుతం సమంత టాలీవుడ్ లో హీరోయిన్ గా మళ్ళీ బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు..

 

Related posts

వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

murali

డాకు మహారాజ్ : డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య.. బాబీ పనితనానికి ఫిదా అయ్యరుగా..!!

murali

బాల‌య్య కోరిక‌లు నెరవేరుతున్నాయి

filmybowl

Leave a Comment