గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. రాంచరణ్ కెరీర్ లో ఈ సినిమా 16 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇటీవలే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ప్రకటించి ఫస్ట్ లుక్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసారు.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాంచరణ్ మాస్ లుక్ లో కనిపించాడు..రాంచరణ్ ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులలో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు, అలాగే విలక్షణ నటుడు జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు..
ప్రభాస్ ‘ఫౌజీ’ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?
అయితే చరణ్ పుట్టిన రోజునే గ్లింప్స్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ భావించారు… కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల గ్లింప్స్ రిలీజ్ వాయిదా పడింది. తాజాగా ఉగాది పండగ సందర్భంగా పెద్ది సినిమా గ్లింప్స్ రిలీజ్ పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ పెద్ది సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియోని ఏప్రిల్ 6 న శ్రీరామ నవమి పండగ రోజు గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఈ గ్లింప్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కోసం మరో క్రేజీ న్యూస్ చెప్పింది.ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ ని టీ- సిరీస్ ఏకంగా 35 కోట్లకు దక్కించుకుంది..
చరణ్, రెహమాన్ కాంబినేషన్ లో ఇదే మొదటి మూవీ కావడం విశేషం..దీనితో ఈ సినిమాపై పిచ్చ క్రేజ్ ఏర్పడింది..సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీలో ఫ్యాన్స్ కి కావాల్సిన అన్నీ ఎలిమెంట్స్ వుంటాయని మేకర్స్ తెలిపారు..