MOVIE NEWS

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్.. ఓజీ తరువాత మరిన్ని సినిమాలు..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ పూనకంతో ఊగి పోతారు.. అంతలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని పవర్ స్టార్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ లో ఏ హీరోకి లేనంత క్రేజ్ పవన్ కల్యాణ్ కి వుంది.. పవన్ కల్యాణ్ నటించిన ఎలాంటి సినిమా అయినా మొదటి రోజు ఓపెనింగ్స్ ఊహించని రేంజ్ లో వస్తాయి.. ప్రస్తుతం రాజకీయలలో బిజీగా వున్న పవన్ కల్యాణ్ తన లైనప్ లో వున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు..కానీ ఈ సినిమా షూటింగ్స్ ఇంకా పూర్తి కాకపోవడానికి అసలు కారణం పవన్ రాజకీయాల బిజీ వల్ల సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు.ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక మరింత బిజీ ఉండటంతో చేతిలో ఒప్పుకున్న సినిమాలకు వారం రోజులు కూడా కంటిన్యుగా డేట్స్ ఇవ్వడం కుదరటం లేదు..అయితే పవన్ రాజకీయాలలో కీలక స్థాయిలో ఉన్నందుకు ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నా సినిమాలు చెయ్యట్లేదు అనే బాధ కూడా వుంది.ప్రస్తుతం పవన్ లైనప్ లో హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. ఇందులో హరిహర వీరమల్లు, OG సినిమాలు మాత్రమే వస్తాయి, మిగిలిన రెండు సినిమాలు ఆగిపోయినట్టే అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు.

RC16 : చరణ్ బర్త్డే ట్రీట్..గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా..!!

హరిహర వీరమల్లు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి మే 9న రిలీజ్ కు సిద్ధం అవుతుంది…ఇక పవన్ నటిస్తున్న  ఓజీ సినిమా పై అయితే భారీ అంచనాలు ఉన్నాయి.ఓజీ సినిమాకు మాత్రం 20 రోజులు డేట్స్ కేటాయించాలి.. అలాగే ఫిట్ బాడీ మెయింటైన్ చేయాలి. దీంతో పవన్ ఈ రెండు సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే OG తర్వాత పవన్ సినిమాలు మానేస్తారు అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ తాజాగా పవన్ ఫ్యాన్స్ కి శుభవార్త చెప్పారు. పవన్ ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ తాను సినిమాలు చేస్తాను అని ప్రకటించాడు…

నాకు ఎలాంటి ఆదాయ మార్గాలు లేవు. నాకు వ్యాపారాలు లేవు. సినిమాల్లో నిర్మాతను కూడా కాదు. నాకు ఉన్నది నటన ద్వారా ఆదాయ మార్గం ఒక్కటే. నాకు డబ్బులు అవసరం ఉన్నంతకాలం సినిమాలు చేస్తాను. నేను ఒప్పుకున్న సినిమాలకు న్యాయం చేస్తాను. కానీ ప్రస్తుతం పాలనకు ఎలాంటి ఆటంకం కలగకుండా కుదిరినప్పుడు డేట్స్ ఇస్తూ సినిమాలు చేస్తాను అని ఆయన అన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు..

 

Related posts

వినాలి వీరమల్లు మాట వినాలి.. ప్రోమో అదిరిపోయిందిగా..!!

murali

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

murali

డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. “సలార్ 2” మైండ్ బ్లోయింగ్ అప్డేట్..!!

murali

Leave a Comment