MOVIE NEWS

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే.. వాయిదా పర్వంలో వీరమల్లు..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ హరిహరవీరమల్లు “.. క్రిష్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే పవన్ రాజకీయాలలో బిజీ కావడం వల్ల ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది.. దీనితో ఈ సినిమా నుండి దర్శకుడు క్రిష్ తప్పుకున్నారు.. బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా మిగిలిన భాగాన్ని ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ పూర్తి చేసే భాద్యత తీసుకున్నారు.. ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ ను మార్చి 28 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

తమన్ మాటలకు చిరూ రియాక్షన్.. ట్వీట్ వైరల్..!!

అయితే ఇప్పుడు ఆ డేట్ కి రావడం కష్టమే అనిపిస్తుంది.. పవన్ కల్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన యంగ్‌ హీరో నితిన్ ప్రస్తుతం రాబిన్హుడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు..అయితే నితిన్ ఏకంగా పవర్ స్టార్ సినిమాకు పోటీగా తన కొత్త సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం విశేషం. వెంకీ కుడుముల దర్శకత్వంలో.. నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ మూవీ 2024 డిసెంబర్ 20న విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్‌గా.. మార్చి 28న రాబిన్ హుడ్ రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ డేట్ లాక్ చేశారు. కానీ అదే రోజు పవర్ స్టార్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోను రిలీజ్ చేసి తీరుతామని నిర్మాతలు చెబుతూ వస్తున్నారు..

ఇప్పటికే వీరమల్లు షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సూపర్ స్పీడ్‌లో జరుగుతోంది.రీసెంట్‌గా ఫస్ట్ సింగిల్ కూడ రిలీజ్ చేయగా ఆ సాంగ్ సినిమా పై మంచి హైప్ తీసుకొచ్చింది. మాట వినాలి అంటూ స్వయంగా పవన్ పాడిన ఈ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో.. పవర్ స్టార్ ఫ్యాన్స్ వీరమల్లు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు..కానీ ఇప్పుడు అదే రోజు నితిన్ సినిమా రానుందని ప్రకటించడంతో.. వీరమల్లు మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందా అనే సందేహాలు వెలువడుతున్నాయి

Related posts

పుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ కోసం రంగంలోకి దిగిన స్టార్ సింగర్స్..!!

murali

బాలయ్య “డాకు మహారాజ్ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?

murali

గేమ్ ఛేంజర్ టీజర్‌ వచ్చేది అప్పుడే

filmybowl

Leave a Comment