MOVIE NEWS

ఆ మూడు సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ ఏడాది మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు.. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమాను మేకర్స్ మే 9 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు…

ప్రభాస్ ‘కల్కి ‘ పార్ట్ 2 బిగ్ అప్డేట్..!!

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజీ”.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ఛాన్నాళ్లకు పవర్ఫుల్ గ్యాంగస్టర్ రోల్ లో కనిపించబోతున్నాడు.. దీనితో ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ మేకర్స్ ని కోరుతున్నారు.. ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు.. ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు..మేకర్స్ ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం పవన్ డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు.

తాజాగా మైత్రీ మూవీ మేకర్స్, దానయ్య, ఏ ఎం రత్నం లతో భేటీ అయిన పవన్ మూడు సినిమాలను త్వరగా పూర్తి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. వీరమల్లు మే లో రిలీజ్ కావడంతో ఆ తరువాత ఓజీ సినిమాను జూన్ లేదా జులై లో తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారు..ఓజీ తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పూర్తి చేయనున్నారు.. దర్శకుడు హరీష్ శంకర్ సైతం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.

Related posts

అనగనగా ఒక రాజు : జాతిరత్నం హీరో ఈజ్ బ్యాక్.. టీజర్ అదిరిందిగా..!!

murali

మెగాస్టార్ అనిల్ రావిపూడి సినిమాకు ముహూర్తం ఫిక్స్.. గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే..?

murali

మెగాస్టార్ “విశ్వంభర” స్టోరీ లీక్.. ఆందోళనలో ఫ్యాన్స్..!!

murali

Leave a Comment