Parasuram : పరశురామ్…. క్లీన్ ఫ్యామిలీ సినిమాలు తియ్యడంలో దిట్ట. అలాగే ఆ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ని సరిగ్గా తూకం వేసి అందరిని రంజింప చెయ్యగల దర్శకుడు.
అన్నీ సరిగ్గానే ప్లాన్ చేసినా ఎక్కడో అంచనాలు పెరిగి పోవడం వలనో లేదా తన మీద తనకి కాన్ఫిడెన్స్ పెరగడం వల్లనో ఈ దర్శకుడి లాస్ట్ సినిమా డిజాస్టర్ అయింది.
విజయ్ దేవరకొండ లాంటి యూత్ స్టార్, మృణాల్ ఠాకూర్, రాజు కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీస్టార్ అస్సలు అంచనాలని చేరుకోలేదు.
ఆ సినిమా తర్వాత పరశురామ్ సినిమా ఏంటన్న చర్చ చాలా కాలం గా జరుగుతోంది.
ఆ మధ్య తమిళ స్టార్ హీరో కార్తి కోసం ఓ కథ సిద్ధం చేసుకున్నాడు. ఈ విషయాన్నీ పరశురామ్ మీడియా తో చెప్పారు. అయితే… రీసన్స్ తెలీదు గాని ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు.
ఇప్పుడు స్టార్ బాయ్ టిల్లు అదేనండి సిద్దు జొన్నలగడ్డతో సినిమా దాదాపుగా ఖరారు అయిందని ఇండస్ట్రీ లో బాగా టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని తన బ్యానర్ లో నిర్మించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
సిద్దు…. దిల్ రాజు కి ఓ సినిమా బాకీ ఉన్నాడు రాజు గారు ఎప్పుడు అడ్వాన్స్ కూడా ఇచ్చి లాక్ చేసారని సన్నిహితుల నుంచి తెలుస్తుంది.
‘ఫ్యామిలీస్టార్’ నిర్మాణంలో ఉన్నప్పుడే రాజు ప్రొడక్షన్ లో మరో సినిమా కి పరశురామ్ అంగీకరించారని టాక్. సో రాజు ఇప్పుడు వీళిద్దరి కాంబినేషన్ సెట్ చేసారు అంటున్నారు.
Read Also : విశ్వం ట్రైలర్…. వైట్ల మార్క్ కనపడింది…
అయితే ఇప్పుడు సినిమా కార్తి కోసం అనుకొన్న కథే సిద్దు స్టైల్ కి తగ్గట్టు మార్చి చేస్తున్నారా? లేక ఆ కథని పక్కన అలాగే ఉంచి కొత్త కథతో ఈ సినిమా ని ముందుకు తీసుకెళ్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.
సిద్దు ప్రస్తుతం బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ తో చేస్తున్న ఓ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వొస్తుంది. అలాగే నీరజ కోన దర్శకత్వం లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ‘తెలుసు కదా’ అనే మరో ప్రాజెక్టు చేస్తున్నారు. ఇవి రెండూ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చాయి. వీటి తరవాత.. పరశురామ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అవుతది అని తెలుస్తోంది.
ఈ లోపు పరశురాం ని కథ మీద ఇంకా బాగా పని చేయమని రాజు చెప్పినట్టు వినింది.
Follow us on Instagram