MOVIE NEWS

ఇంకా 100 రోజులే..తలైవా ‘కూలీ’ వచ్చేస్తుంది..!!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. లోకేష్ కనగరాజ్ గతంలో తెరకెక్కించిన విక్రమ్, లియో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తలైవా కూలీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.దీంతో సూసర్ స్టార్ ఫ్యాన్స్ ‘కూలీ’ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్” సినిమా గత ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అయి యావరేజ్ గా నిలిచింది..

ఫ్యామిలీ తో చిల్ అవుతున్న.. ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్..!!

దీనితో లోకేష్ కనగరాజ్ సినిమా తో భారీ హిట్ అందుకోవాలని రజనీకాంత్ భావిస్తున్నారు.. కోలీవుడ్ ఎప్పటి నుంచో కలగంటున్న 1000 కోట్లు డ్రీమ్ ఈ సినిమాతో నెర వేరుతుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ గోల్డ్‌ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌ లో తెరకెక్కుతుంది..ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు…

మరో 100 రోజుల్లో తలైవా ప్రభంజనం చూస్తారని మేకర్స్ తెలిపారు..కూలీ సినిమాకు కనుక హిట్ టాక్ వస్తే మాత్రం వసూళ్ల సునామి ఆపడం ఎవ్వరి వల్ల కాదు.. తలైవా కి ప్రపంచ వ్యాప్తంగా ఏ విధమైనా ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మేకర్స్ సైతం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు

Related posts

పుష్ప 2 రీలోడ్ వెర్షన్.. మరో 20 నిముషాలు అదనంగా.. రిలీజ్ ఎప్పుడంటే..?

murali

“డబుల్ ధమాకా” తో వస్తున్న రవితేజ.. ఈ సారి అంతకు మించి..!!

murali

“మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం”.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment