మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది దేవర సినిమాతో తన కెరీర్ లోనే భారీ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. దేవర సినిమా తరువాత ఎన్టీఆర్ పవర్ఫుల్ లైనప్ తో దూసుకుపోతున్నాడు.. ఇప్పటికే వార్ 2 షూటింగ్ జోరుగా సాగుతుండగా ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో బిగ్గెస్ట్ సినిమా మొదలు పెట్టేందుకు సిద్దమవుతున్నాడు..ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ కాంబినేషన్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు..మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించి ముందుగా అనుకున్న షెడ్యూల్ కొంత ఆలస్యమైనా ఇప్పుడు మేకర్స్ ప్లాన్ చేసిన సరికొత్త షెడ్యూల్ మొదలయ్యే సమయం వచ్చేసింది. వార్ 2 షూటింగ్ చివరి దశకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ పూర్తిగా ప్రశాంత్ నీల్ సినిమా మీద ఫోకస్ పెట్టనున్నాడు.
కన్నప్ప : ఒక్క పాటతో సినిమాపై అంచనాలు పెంచేసిన మంచు విష్ణు..!!
ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో రూపొందే ఈ చిత్రం, టెక్నికల్‌గా మరింత గ్రాండియర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కథలో ప్రధానమైన ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ ఎపిసోడ్స్‌ను ఇప్పుడు షూట్ చేయబోతున్నట్లు సమాచారం..ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ నెల 17 నుంచి షూటింగ్ మొదలవుతోంది. అయితే ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదు. ప్రధానమైన కొన్ని ఫైట్, నేచురల్ విజువల్స్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట.
వికారాబాద్ అడవుల్లో కొన్ని కీలకమైన ఎపిసోడ్స్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం.హీరో లేకుండానే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేయబోతున్నారు..తదుపరి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వనున్నట్లు సమాచారం..ఈ సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకేక్కుతుందటంతో ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి..