పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా భాద్యతలు వహిస్తూనే మరో పక్క తన లైనప్ లో పెండింగ్ లో వున్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తున్నాడు.. ప్రస్తుతం పవన్ నటిస్తున్న మూవీస్ లో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “OG”..సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి…
NKR21 : ‘సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్..!!
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది. ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలలో ఒక మంచి లుక్ ఏదైనా వుంది అంటే ఈ సినిమా లుక్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సినిమా మీద ఉన్న అంచనాలు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. కాకపోతే ఈ సినిమా షూట్ డిలే అవుతూ ఉండడం పవన్ అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు…ఈ సినిమాకి ఇంకా 12 రోజుల పాటు పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయిస్తే పూర్తవుతుంది. కానీ ఆ 12 రోజులకు పవన్ ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారు..అనే విషయం మీద క్లారిటీ లేదు. దీంతో ప్రస్తుతానికి చిత్ర యూనిట్ అంతా పవన్ కోసమే ఎదురుచూస్తోంది.
సుజిత్ తో పాటు చిత్ర యూనిట్ పవన్ ను ఎన్నోసార్లు అప్రోచ్ అయింది. కానీ ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ సైతం భారీ రేటుకు అమ్ముడయ్యాయి. సినిమా షూటింగ్ త్వరగా పూర్తయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు…రోజులు గడుస్తున్న పవన్ ఫ్యాన్స్ లో “ఓజీ” పై క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు..కానీ సినిమాని ఇలాగే లేట్ చేస్తే ఆ క్రేజ్ తగ్గిపోతుందేమో అని ఫాన్స్ ఫీల్ అవుతున్నారు.ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. దానయ్య డీవీవీ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు..