MOVIE NEWS

OG : పవర్ స్టార్ సినిమాలో గ్లోబల్ స్టార్ ఇది కదా మాస్ కాంబినేషన్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్‌లో ఉన్న బిగ్గెస్ట్ మూవీ “ఓజి”.. సాహో ఫేమ్ సుజిత్ తెర కెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ సినిమాను “ఆర్ఆర్ఆర్” వంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీని నిర్మించిన నిర్మాత దానయ్య డి.వి.వి ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.. త్వరలోనే ‘ఓజీ’ సినిమా పనులను వేగంగా మొదలుపెట్టబోతున్నారని సమాచారం.ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి…’

ఓజీ’ సినిమా ముంబై మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ .ఇందులో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతమేర పూర్తయింది, ఇటీవల ఈ ప్రాజెక్ట్ తిరిగి ప్రారంభమైంది. త్వరలో పవన్ కల్యాణ్ కూడా షూటింగ్‌లో జాయిన్ కానున్నారని చిత్ర యూనిట్ తెలిపింది…ఇటీవలే ‘ఓజీ’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ చేయబోతున్నారని వార్తలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే..ఈ చిత్ర దర్శకుడు సుజిత్ గతంలో ప్రభాస్‌తో ‘సాహో’ చిత్రాన్ని రూపొందించారు. నార్త్ లో ఆ సినిమా భారీ హిట్ కావడం, ప్రభాస్‌తో సుజిత్ కి మంచి అనుబంధం ఏర్పడింది.. దీనితో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

మెగాస్టార్ తో సినిమా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

అలాగే పవన్ కుమారుడు అకీరా నందన్ కూడా ‘ఓజీ’ సినిమా తో తన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరిగింది.సినిమాలో అకిరా కి కీలకమైన పాత్ర ఉండబోతుందని,అతడి సీన్లు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు..అయితే ఈ వార్తలపై ఇంకా చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.తాజాగా మరో ఆసక్తికరమైన న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వరుసగా ఇన్ని గాసిప్స్ వినిపిస్తున్న చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించకపోవటంతో వీటిలో నిజం ఉందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.. అయితే మేకర్స్ మాత్రం అధికారికంగా స్పందించడం లేదు..

Related posts

పుష్ప 2 టికెట్ ధరలు భారీగా పెంపు ..పెరిగిన ధరలు ఎలా వున్నాయంటే..?

murali

మంగళవారం డైరెక్టర్ కే ఎందుకిలా….

filmybowl

7/G బృందావన కాలనీ 2 : క్లాసిక్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..!!

murali

Leave a Comment