MOVIE NEWS

OG : పవన్ కల్యాణ్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ OG. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ డి.వి.వి దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై పిచ్చ హైప్ తీసుకొచ్చాయి.. అయితే “ఓజి” సినిమా ఎప్పుడో మొదలైన కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటం కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది .తాజాగా ఈ సినిమా షూటింగ్ ను మేకర్స్ తిరిగి స్టార్ట్ చేసారు.

అల్లు vs మెగా : పుష్ప 2 బెన్ఫిట్ షోస్ పై సరికొత్త పంచాయితీ..!!

ఈ చిత్ర షూటింగ్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ను మేకర్స్ ఇటీవల చిత్రీకరించారు.కాగా ఇప్పుడు ఈ OG సినిమాకు సంబంధించి సెన్సేషన్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది… పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీలో మరో స్టార్ హీరో నటిస్తున్నాడు అని సమాచారం.ఆ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్.ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ఓ పవర్ ఫుల్ క్యారక్టర్ ఉంటుందట. ఆ పాత్ర కోసం దాదాపు చాలా డిస్కషన్స్ తర్వాత మేకర్స్ రెబల్ స్టార్ ను సంప్రదించారని సమాచారం..

సుజీత్ తో వున్న సాన్నిహిత్యంతో ప్రభాస్ ఆ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ అవుతుంది.. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం..ఓజి సినిమాలో మరో స్పెషల్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది..ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా నటిస్తున్నట్లు సమాచారం.. త్వరలోనే మేకర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వనున్నారు..

Related posts

Nandamuri Bala Krishna : బాక్సులు బద్దలయ్యే అప్డేట్.. ఇక దబిడి దిబిడే!

filmybowl

స్పిరిట్…. యూత్ కి కనెక్ట్ అయ్యే పాయింట్ తోనే

filmybowl

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రాంచరణ్..”గేమ్ ఛేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్ ..!!

murali

Leave a Comment