MOVIE NEWS

ఓజి : ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ కి ఫ్యాన్స్ కి పూనకాలే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నారు.. గత ఏడాది ఎన్నికల కారణంగా పవన్ లైనప్ లో వున్న సినిమాల షూటింగ్స్ అన్ని హోల్డ్ లో పడ్డాయి.. ఎన్నికలు ముగియగానే పవన్ హోల్డ్ లో పడ్డ సినిమాల షూటింగ్ ని తిరిగి ప్రారంభించాడు.. పవన్ ముందుగా ఎప్పటి నుంచో హోల్డ్ లో పడ్డ “ హరిహర వీరమల్లు “ సినిమా షూటింగ్ పూర్తి చేసే పని లో వున్నాడు.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ ని మార్చి 28 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

మాస్ జాతర : రవితేజ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ వైరల్..!!

ఈ సినిమా త్వరగా కంప్లీట్ చేసి “ “ఓజి “ షూటింగ్ లో పాల్గొనాలని పవన్ భావిస్తున్నాడు.. “ఓజి “ సినిమా కోసం పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డివీవి గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. “ఓజి” సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉండటంతో దర్శకుడు సుజీత్ ఈ సినిమాని చాలా కేర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నాడట… అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికి ఎంతో హైలైట్ గా నిలవబోతుందనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి చాలా ప్లస్ అవుతాయాని సమాచారం.. ఈ సినిమాలో పవన్ సరసన గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే ఓజి గ్లింప్స్ కి తమన్ ఇచ్చిన బిజిఎం ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చింది.. ఓజితో తన మ్యూజిక్ టాలెంట్ ఏంటో చూపిస్తా అని తమన్ ఓపెన్ ఛాలెంజ్ చేసాడు…

Related posts

ముదురుతున్న తొక్కిసలాట వివాదం.. అల్లుఅర్జున్ ట్వీట్ వైరల్..!!

murali

రాజమౌళి చెప్పిందే నిజమైంది.. ఇక నుంచి అసలైన బాక్సాఫీస్ వార్ షురూ..!!

murali

ఆ స్టార్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీ.. కొరటాల స్కెచ్ అదిరిందిగా..!!

murali

Leave a Comment