పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’.. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన ఇంతవరకు షూటింగ్ పూర్తి కాలేదు.. ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుంది.. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.. ఇదిలా ఉంటే త్వరలోనే షూటింగ్‌ను పూర్తి చేసి విడుదల చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.దీనితో మేకర్స్ సెప్టెంబర్ 2025లో ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నట్టు తెలియడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.
కన్నప్ప : మళ్ళీ విడుదల వాయిదా.. విష్ణు షాకింగ్ పోస్ట్..!!
‘ఓజీ’ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా, ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోంది. పవన్ కల్యాణ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.. అలాగేక్యూట్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ పవన్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ మరియు పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ హైప్ తీసుకొచ్చాయి.ప్రస్తుతం పవన్ తన సినిమా కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేయడానికి సమయాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారు. మే-జూన్ నెలల్లో 25 రోజుల షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్‌ను ముగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.