MOVIE NEWS

ఓదెల 2 : శివశక్తి అవతారంలో తమన్నా.. టీజర్ అదిరిందిగా..!!

టాలీవుడ్ హాట్ బ్యూటి హెబ్బా పటేల్, వశిష్ఠ సింహా ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ మూవీ ‘ఓదెల రైల్వే స్టేషన్’.. 2022 లో సైలెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాలో సాయి రోనాక్,పూజిత పొన్నాడ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించాడు..

మిరాయ్ : రిలీజ్ డేట్ లాక్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ఊర్లో చాకలిగా పనిచేసే రాధ తన భర్త తిరుపతితో కలిసి నివసిస్తూ ఉంటుంది.. కానీ ఆమె భర్తకు రాధ.. సుఖం ఇవ్వదు. బాగా చదువుకుంటున్న తనని ఓ పనికిరాని వాడికి ఇచ్చి పెళ్లి చేశారు అనేది ఆమె ఆవేదన..అలాగే తిరుపతికి ఏదో ఒక వంక పెడుతూనే ఉంటుంది. అందువల్ల ఆమెతో అతను సరిగ్గా కాపురం చేయలేడు. దీంతో అతను సంసారానికి పనిచేయడు అని ఆమె ఫిక్స్ అవుతుంది. దీంతో మనోవేదనకు గురైన తిరుపతి.. ఆ ఊర్లో ఆడవాళ్ళ ప్రాణాలు తీస్తూ ఒక మృగంలా మారిపోతాడు. చివరి వరకు ఈ విషయం రాధకి తెలీదు.ఆ తర్వాత విషయం తెలుసుకున్న రాధ.. తిరుపతిని నరికి చంపేస్తుంది. అక్కడితో ఆ సినిమా కథ పూర్తి అవుతుందని అంతా అనుకున్నారు. కానీ చనిపోయిన తిరుపతి ప్రేతాత్మగా మారి ఆ ఊరి వాళ్ళని చిత్ర హింసలకు గురిచేస్తున్నట్లు తాజాగా రిలీజ్ అయిన ‘ఓదెల 2’టీజర్లో చూపించారు. అయితే ఈ సినిమాలో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుంది. తమన్నా శివశక్తి అవతారంలో కనిపించబోతుంది..

తాజాగా రిలీజ్ అయిన టీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగింది..సూపర్ సస్పెన్స్ తో ఈ టీజర్ ని కట్ చేసారు.. ఈ సినిమాకు కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తుండగా స్టార్ డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.. ఓదెల పార్ట్ 1 లో చూపించినట్లుగానే ఈ సినిమాలో అంతకు మించి థ్రిల్లింగ్ అంశాలు చూపించనున్నట్లు సమాచారం..

 

 

Related posts

ఎన్టీఆర్-నీల్ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

murali

ముదురుతున్న తొక్కిసలాట వివాదం.. అల్లుఅర్జున్ ట్వీట్ వైరల్..!!

murali

మెగాస్టార్ తో సినిమా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment