MOVIE NEWS

ఎన్టీఆర్ “వార్ 2” బిగ్ అప్డేట్ వైరల్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “వార్ 2”..ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీగా వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించారు.. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అనే టాక్ ఉంది.యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కేవలం ఒక్క పాట మాత్రమే బ్యాలన్స్ ఉందని సమాచారం. ఆ పాట ఈ ఇద్దరు హీరోలపై చిత్రీకరించాల్సి ఉందట. మార్చిలోనే షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ప్రాక్టీస్ లో హృతిక్ రోషన్ కు గాయం కావడంతో ఈ షూటింగ్ పోస్ట్ పోన్ అయింది.

VD14 : రౌడీ స్టార్ బర్త్డే స్పెషల్ పోస్టర్ రిలీజ్..!!

అయితే మేకర్స్ మొదటి నుంచి ఈ సినిమా ఆగస్ట్ 14నే విడుదలవుతోందని చెప్పుకుంటూ వస్తున్నారు… మరి ఆ సాంగ్ ఎప్పుడు షూట్ చేస్తారా అని ఫ్యాన్స్ లో ఓ కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ కు తాజాగా యశ్ రాజ్ బ్యానర్ తెరవేసింది.జూన్ నెలలో యశ్ రాజ్ స్టూడియోస్ లో వేసిన సెట్స్ లో ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. మరి జూన్ లో ఏ వారం షూటింగ్ ఉంటుంది అనేది తెలియాల్సి వుంది.. ఇద్దరు స్టార్ హీరోలు డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే నాటు నాటు సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే… ఇటు ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా బెస్ట్ డ్యాన్సర్ అనే విషయం అందరికీ తెలిసిందే.. అందుకే వీరి డ్యాన్స్ నంబర్ కూడా నాటు నాటు రేంజ్ లో దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..

Related posts

NTR -NEEL : భారీ లొకేషన్స్ లో షూటింగ్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ అదిరిందిగా..!!

murali

అఖండ 2 : బాలయ్య సినిమాలో అఘోరిగా అలరించనున్న ఆ సీనియర్ స్టార్ హీరోయిన్..!!

murali

వార్నర్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్న రాజేంద్రప్రసాద్.. వీడియో వైరల్..!!

murali

Leave a Comment