MOVIE NEWS

“ఛావా”కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్.. స్పందించిన నిర్మాత..!!

బాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన “ ఛావా” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హీరో విక్కీ కౌశల్ ఛావా సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. “ఛావా” సినిమాతో విక్కీ కౌశల్ హిందీ బాక్సాఫీసుకు సరికొత్త ఉత్సాహం తీసుకొచ్చాడు.. హిందీ అప్ కమింగ్ సినిమాలకు ఛావా సినిమా మంచి బూస్టప్ ఇచ్చింది.. ఈ దెబ్బతో బాలీవుడ్ బాక్సాఫీస్ కు పూర్వ వైభవం వచ్చేలా కనిపిస్తుంది.హీరో విక్కీ కౌశల్ గత కొంతకాలంగా వైవిద్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాడు..తన పాత సినిమా రికార్డులు తానే చెరిపేస్తూ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నాడు.విక్కీ కౌశల్ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది.. ఛావా సినిమాతో విక్కీ కౌశల్ ఇమేజ్ సైతం బాగా పెరిగింది..ఛావాలో శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటనకు భాషతో సంబంధం లేకుండా అందరూ ఫిదా అవుతున్నారు..

ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ ఏకంగా అన్ని కిలోల బరువు తగ్గనున్నాడా..?

ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తుంది. ఛావా సినిమా ఏకంగా 300 కోట్ల నెట్ కలెక్షన్లను క్రాస్ చేసినట్లు తెలుస్తుంది.. విక్కీ కెరీర్ లోనే హయ్యెస్ట్ నెట్ వసూలు రాబట్టిన మూవీగా ఛావా నిలిచింది. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టగలుగుతుంది..ఇదిలా ఉంటే ఈ సినిమాను హిందీలో చూసిన కొంత మంది తెలుగులో రిలీజ్ చేస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసారు..ఈ నేపథ్యంలో ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసేందుకు గీతా ఆర్ట్స్ సంస్థ ముందుకొచ్చింది..ఈ సినిమాని తెలుగు వెర్షన్ హక్కులు కొనుగోలు చేసిన గీతా ఆర్ట్స్ మార్చి 7వ తేదీన ఈ సినిమాను తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతుంది..తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు..

అయితే ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారనే న్యూస్ వైరల్ అయింది.. ట్రైలర్ లో ఎన్టీఆర్ వాయిస్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.. తాజాగా ఈ అంశంపై గీతా ఆర్ట్స్ సహ నిర్మాత బన్నీ వాసు స్పందించారు..ఎన్టీఆర్ వాయిస్ అందించారనే వార్తలు చూసి షాకయ్యా. ఆయన్ని మేము సంప్రదించలేదు. ఎందుకంటే వారం క్రితమే ఈ సినిమా రిలీజ్‌ హక్కులు సొంతం చేసుకున్నాం. ఇంత తక్కువ సమయంలో స్టార్స్‌ను ఇబ్బంది పెట్టాలని ఎవరూ అనుకోరు. అందుకే డబ్బింగ్‌లో నిపుణులైన వ్యక్తులతో తెలుగులో డబ్‌ చెప్పించాం అని ఆయన తెలిపారు..

 

 

Related posts

పుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ కోసం రంగంలోకి దిగిన స్టార్ సింగర్స్..!!

murali

తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా ఐకాన్ స్టార్..?

murali

డాకు మహారాజ్ : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక మాస్ జాతర షురూ..!!

murali

Leave a Comment